పుట్టినరోజు నాడు KTR తీసుకున్న గొప్ప నిర్ణయం.. ప్రశంసలు కురిపిస్తోన్న జనాలు!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యంగ్‌, అండ్‌ డైనమిక్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్‌. రాజకీయాల్లో తండ్రి తగ్గ తనయుడిగా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పాలిటిక్స్‌లోనే కాక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు కేటీఆర్‌. ట్విట్టర్‌లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. సోషల్‌ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించడమే కాక.. సాయం కోరిన వారిని తక్షణమే ఆదుకుంటారు కేటీఆర్‌. నేడు తారకరాముడి పుట్టిన రోజు. బర్త్‌డే సందర్భంగా కేటీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన ఫాలోవర్స్‌ను కూడా ఇలానే చేయమని కోరారు. ఇంతకు కేటీఆర్‌ తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే..

బర్త్‌డే సందర్భంగా పేద విద్యార్థుల కోసం కేటీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. యూసఫ్‌గూడలోని అనాథాశ్రమానికి సాయం చేయాలనుకున్నారు కేటీఆర్‌. ఈ క్రమంలో ఆశ్రమంలో ఉంటున్న ప్రతిభావంతులైన 47 మంది పది, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు, అలానే ప్రొఫెషనల్‌ కోర్సులు చేస్తోన్న మరో 47 మంది స్టూడెంట్స్‌కు సాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్‌. గిఫ్ట్ ఏ స్మైల్ సంస్థ తరఫున ఆ విద్యార్థులకు తలా ఓ ల్యాప్ టాప్‌ ఇవ్వటమే కాకుండా.. వాళ్లందరికీ రెండేళ్ల పాటు ఉచితంగా కోచింగ్ ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు.

‘‘కన్నవారు ఎవరో తెలియకపోయినా.. ఆదుకునే వారు లేకపోయినా సరే.. ఏమాత్రం కృంగిపోకుండా.. తమ కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తోన్న ఈ చిన్నారులు తెలంగాణ రాష్ట్రపు విలువైన సంపద. వారి ప్రతిభను ప్రొత్సాహిస్తూ.. వారికి ఉపయోగపడే విధంగా ఒక్కొక్కరికి ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ సంస్థ తరఫున వీటిని అందిస్తున్నాను. అలానే నా అభిమానులు కూడా.. నా బర్త్‌డే సందర్భంగా ప్రకటన కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసే బదులు.. ఇలా అనాథ పిల్లలకు ఆ మొత్తాన్ని వినియోగిస్తే.. నేను చాలా సంతోషిస్తాను’’ అని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌

కేటీఆర్‌ ప్రతి ఏటా తన బర్త్‌డే సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రారంభించడమే కాక.. తన అభిమానుల చేత కూడా సేవా కార్యక్రమాలు చేయిస్తుంటారు. గతంలో కేటీఆర్‌ గిఫ్ట్‌ ఏం స్మైల్‌ సంస్థ తరఫున గ్రామాల్లో అంబులెన్స్‌లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంచే కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఏకంగా పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ ఇచ్చి.. వారు భవిష్యతుకు బాసటగా నిలుస్తున్నారు కేటీఆర్‌. ఆయన తీసుకున్న నిర్ణయంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments