P Krishna
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపు బావుల ఎగురవేయాలని అన్ని పార్టీలు ముమ్మర ప్రచారాలకు శ్రీకారం చుట్టాయి. అధికార పార్టీ తరుపున స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా.. మొదటి విడతగా కాంగ్రెస్ తరుపు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారం చేశారు.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపు బావుల ఎగురవేయాలని అన్ని పార్టీలు ముమ్మర ప్రచారాలకు శ్రీకారం చుట్టాయి. అధికార పార్టీ తరుపున స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా.. మొదటి విడతగా కాంగ్రెస్ తరుపు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారం చేశారు.
P Krishna
తెలంగాణలో ఎన్నికల సందడి ఓ రేంజ్ లో కొనసాగుతుంది. అధికార పార్టీ సహా ఇతర పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారాల్లో మునిగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ గట్టి పట్టుమీదే ఉంది. ఈసారి అధికార పార్టీని గద్దె దించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా కొంతకాలంగా తెలంగాణలో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంటూ వస్తుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమౌతుంది. అయితే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ రిలీజ్ చేసి ప్రచారం ముమ్మరం చేస్తుంటే.. బీజేపీ మాత్రం చాలా ఆలస్యంగా నిన్న ఆదివారం మొదటి లీస్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కూడా చేయడం లేదు. తాజాగా బీజేపీ రెండో లీస్ట్ రిలీజ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే…
తెలంగాణలో రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3 కౌంటింగ్ ఉండబోతుందని ఎన్నికల సంఘం తెలిపింది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-పారాలు కూడా ఇచ్చేసింది. కాంగ్రెస్ ఈ మద్యనే 55 మందితో కూడిన ఫస్ట్ లీస్ట్ రిలీజ్ చేసింది. ఇక బీజేపీ మాత్రం తర్జన భర్జన చేసి మొత్తానికి 52 మంది అభ్యర్థులను ఖారారు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసి ఆదివారం ఈ లీస్ట్ రిలీజ్ చేశారు. మొదటి లీస్ట్ లో బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు లాంటి అగ్ర నేతల పేర్లు ప్రకటించింది. అయితే మొదటి లీస్టు లో అధ్యక్షులు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, విజయశాంతి, డాక్టర్ లక్ష్మణ్, డీకే ఆరుణ పేర్లు మాత్రం లేవు. తాజాగా రెండవ లీస్ట్ పై పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతు.. ‘ఈసారి తెలంగాణలో ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం.. ప్రధాని మోదీ, అగ్రనేతలతో చర్చలు జరిపి మొదటి లీస్టు విడుదల చేశాం. ఇక రెండవ జాబితా కూడా ఖరారైంది.. అది దసరా తర్వాత విడుదల చేస్తాం. రాష్ట్రంలో అధికార పార్టీ దురాగతాల గురించి ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు. కుంటుం పాలన అంతం చేయడానికి ఇది సరైన సమయం, ఒక్కసారి బీజేపికి అవకాశం ఇవ్వండి.. అభివృద్ది అంటే ఏంటో చూపిస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కవలపిల్లలు.. ఆ పార్టీలను నమ్మొద్దు. దసరా తర్వాత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం. ఈ నెల 27న అమిత్ షా, నెల చివరన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు ప్రచారంలో పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకువస్తాం. ఇప్పటి వరకు ప్రచారం లేదని అపోహలు వొద్దు.. మోడీ పాలన రాష్ట్రంలోని ప్రతి గడపకు తీసుకువెళ్తాం.