iDreamPost
android-app
ios-app

అరగంట లేటు కావొచ్చు.. కానీ జీవితాంతం రావని ఆ పిల్లలకు ఎలా చెబుతావ్ తల్లీ

రెప్పపాటులో జరిగే ప్రమాదాలను ఊహించడం కష్టం. జరిగిన తర్వాత గుర్తించడం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. బయటకు వెళితే.. తిరిగి ఇంటికి వస్తామన్న గ్యారెంటీ లేకుండా పోయింది.

రెప్పపాటులో జరిగే ప్రమాదాలను ఊహించడం కష్టం. జరిగిన తర్వాత గుర్తించడం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. బయటకు వెళితే.. తిరిగి ఇంటికి వస్తామన్న గ్యారెంటీ లేకుండా పోయింది.

అరగంట లేటు కావొచ్చు.. కానీ జీవితాంతం రావని ఆ పిల్లలకు ఎలా చెబుతావ్ తల్లీ

పేద, మధ్య తరగతి కుటుంబాల్లో భార్యా భర్తలు పనిచేస్తేనే ఇల్లు గడుస్తోంది. దీంతో పిల్లల్ని, పెద్దల్ని ఇంట్లో వదిలేసి పనులకు వెళుతున్నారు దంపతులు. భర్త కన్నా భార్యకు మరిన్నీ బాధ్యతలు. పొద్దున్నే లేచి.. ఇంట్లో పనులు చక్కబెట్టుకుని, వంట చేసి భర్తకు, తనకు క్యారేజ్ కట్టుకుని, పిల్లలకు బడికి పంపేసి, అత్తమామాల బాగోగులు చూసుకుని తాను ఉద్యోగానికి వెళుతుంది. అలాగే సాయంత్రం పని ముగించుకుని ఇంటి చేరుకున్నాక.. వంట, ఇతర పనులు చేస్తుంది. దీంతో ఆమెది ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఆఫీసుకు త్వరగా వెళ్లాలని.. అలాగే ఆఫీసు ముగిశాక పిల్లలు, అత్తమాలలకు టైంకి ఫుడ్ పెట్టాలన్న ఉద్దేశంతో టెన్షన్ పడిపోతుంటారు. ఇక బస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. అది టైంకి దొరికితే తామంతా అదృష్టవంతులు ఎవరూ లేరని అనుకుంటారు.

బస్సు రష్‌గా ఉన్న కూడా ప్రాణాలు లెక్క చేయకుండా ఫుట్ బోర్డుపై వేలాడుతూ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఇలాంటి ప్రమాదకరమైన ఘటన వల్ల కొంత మంది చనిపోతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లల తల్లీ.. ప్రమాదవ శాత్తూ బస్సు నుండి జారీ పడి మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొణిజర్ల మండలం పెద్ద మునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్‌లో పనిచేస్తోంది. రోజూలాగే విధులకు వెళ్లేందుకు శనివారం ఉదయం కొణిజర్ల ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే బస్సు రద్దీగా ఉండటంతో ఆమె ఫుట్ బోర్డు వద్ద నిలబడాల్సి వచ్చింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే.. తన ఎదురుగా ఉన్న బస్సును ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ యత్నించాడు.

ఆ సమయంలో మరో ద్విచక్ర వాహనం ఎదురు రాగా డ్రైవర్ బ్రేక్ వేసి..వాహనాన్ని మళ్లించాడు. ఆ సమయంలో డోర్ వద్ద నిలబడ్డ అనూష.. జారి పోయి కింద పడిపోయింది. వెంటనే ఆమెపై నుండి టైర్ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది అనూష. రెప్ప పాటులో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు ప్రయాణీకులు, డ్రైవర్. పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనూష మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమెకు భర్త అశోక్.. ఆరు సంవత్సరాల లోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తన భార్య చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపడుతున్నారు. ఉద్యోగానికి బయలు దేరిన అనూష.. తిరిగి రాదని తెలిసి భర్త కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అమ్మ ఇక తిరిగి రాదని అభం, శుభం తెలియని చిన్నారులకు చెప్పలేక తండ్రి పడుతున్న వేదన వర్ణనాతీతం. విధులకు, ఇంటికి వెళ్లాలని కంగారులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అరగంట ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చు.. నువ్వు తిరిగి ఎన్నటికీ రాదని ఆ పిల్లలకు ఎవరు చెబుతారు తల్లీ .