iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

  • Published Mar 30, 2024 | 9:57 PM Updated Updated Mar 30, 2024 | 9:57 PM

CM Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

CM Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీపై తొలి సంతకం చేశారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు మాసాలకు ఒకసారి ‘ప్రజా పాలన’ కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరించే ఏర్పాటు చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో తనదైన దూకుడు పెంచాడు. ఇప్పటికే మహాలక్ష్మ పథకం అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు రూ.10 లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేద మహిళలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎండాకాలంలో విద్యుత్, తాగు నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ కోత, నీటి సమస్యలు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ‘ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. జూన్ వరకు బోర్లు, బావులు నీటి వనరులు వాడుకోవాలి. తాగు నీటికి ఎద్దడలి లేకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. నీటిని ఎక్కడా వృదా చేయకుండా ప్రజలకు తెలియజేయాలి. గ్రామాల వారీగా కార్యాచరణ తయారు చేయాలి. పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా నీటి సమస్యలు తలెత్తితో వెంటనే సమస్య తీరేవిధంగా వాటర్ ట్యాంకులు సిద్దంగా ఉంచాలిని, ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల లోపు అక్కడి చేరేలా చూడాలని’ సీఎం ఆదేశించారు.