iDreamPost
android-app
ios-app

సామాన్యులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. CMRF దరఖాస్తులపై కీలక నిర్ణయం

  • Published Jul 03, 2024 | 10:55 AM Updated Updated Jul 03, 2024 | 10:55 AM

CMRF: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సామాన్యులకు మేలు జరిగేలా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు మరింత మేలు జరుగనున్నది.

CMRF: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సామాన్యులకు మేలు జరిగేలా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు మరింత మేలు జరుగనున్నది.

సామాన్యులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. CMRF దరఖాస్తులపై కీలక నిర్ణయం

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులకు మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలు కీలక పథకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. సామాన్య ప్రజల ఆరోగ్యం విషయంలో వారికి మరింత ప్రయోజనం చేకూరేలా గుడ్ న్యూస్ అందించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పటి వరకు ఇది ఆఫ్ లైన్ విధానంలో ఉండేది. ఇక నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పేద వారికి జబ్బు చేస్తే చికిత్స కోసం అయ్యే ఖర్చు భరించే స్థోమత వారికి ఉండదు. అలాంటి వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటుంటారు. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిని, తదితర వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం సీఎంఆర్ఎఫ్ ఫండ్ ను సాంక్షన్ చేస్తుంటారు. అయితే ఇదివరకు ఈ ప్రక్రియ అంతా ఆఫ్ లైన్ విధానంలో జరిగేది. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. దీనికోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సచివాయంలో ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక https// cmrf.telangana.gov.in\వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖను జతచేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో బ్యాంక్‌ ఖాతా వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలి. అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఒక కోడ్‌ ఇస్తారు. ఆ కోడ్‌ ఆధారంగా ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆసుపత్రులకు అధికారులు పంపి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్‌ఎఫ్‌ అప్లికేషన్‌ను ఆమోదించి క్లెయిమ్‌ చెక్కును సిద్ధం చేస్తారు. చెక్‌పై దరఖాస్తుదారుడి అకౌంట్‌ నంబర్‌ను ముద్రిస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్కులను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ ను స్వీకరించనున్నారు.