ఉచిత కరెంట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన!

Free Current: తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవలే మంత్రి మండలి సమావేశంలో కూడా ఆమోద తెలిపింది. తాజాగా ఈ అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన చేసింది.

Free Current: తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవలే మంత్రి మండలి సమావేశంలో కూడా ఆమోద తెలిపింది. తాజాగా ఈ అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన చేసింది.

ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరిట  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఫ్రీ బస్సు జర్నీతో పాటు.. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు కార్పొరేట్‌ వైద్యసేవలు అందుతున్నాయి. అలానే రూ.500 గ్యాస్ సిలిండర్ తో పాటు.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కు సైతం ఇటీవల మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫ్రీ కరెంట్ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో గృహజ్యోతి ఒకటి. ఈ స్కీమ్ లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందవచ్చు. కాంగ్రెస్ కోరినట్టే ప్రజలు ఓటేసి కాంగ్రెస్ కు తెలంగాణలో పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ మిగిలి ఐదు గ్యారెంటీ హామీలతో పాటు గృహజ్యోతి పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ కి సంబంధించిన అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ఫ్రీ కరెంట్ పై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారికి కీలక సూచనలు చేసింది. వారు ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుంది. అలా కానీ పక్షంలో ఆధార్ అథెంఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్ లేని వారు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలను టీఎస్ సర్కార్ సూచించింది. ఆ తరువాత పథకం కోసం అప్లై చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ అధికారులు మీటర్ నంబర్ తో ఆధార్ నంబర్ ను అనుసంధానం చేస్తున్నారు.

గతంలో చాలా మందికి ప్రజాపాలన రేషన్ కార్డులకు అధికంగా దరఖాస్తులు చేశారు. ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గృహజ్యోతి పథకానికి మినహాయింపు ఇచ్చింది. గృహజ్యోతి అర్హుల్లో ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా వారి ఆధార్ వివరాలనూ నమోదు చేసుకుంటున్నట్లు విద్యుత్తు శాఖాధికారులు చెబుతున్నారు. ఎవరైనా ప్రజాపాలన గ్రామసభల్లో అయిదు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకపోయినా, వారి ఆధార్ కార్డు, ఫోన్ నంబరు వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ కార్డుతో గృహజ్యోతి పథకం వర్తిస్తుంది.

Show comments