iDreamPost
android-app
ios-app

KCR, రేవంత్, ఈటల రెండు చోట్ల పోటీ! చరిత్ర ఏం చెబుతుందంటే..

ఈ సారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మూడు పార్టీలకు చెందిన కేసీఆర్, రేవంత్, ఈటల రెండేసి స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే రెండు స్థానాల్లో పోటీ చేసేఅంశంలో చరిత్ర కొన్ని నిజాలను చెప్తోంది.

ఈ సారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మూడు పార్టీలకు చెందిన కేసీఆర్, రేవంత్, ఈటల రెండేసి స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే రెండు స్థానాల్లో పోటీ చేసేఅంశంలో చరిత్ర కొన్ని నిజాలను చెప్తోంది.

KCR, రేవంత్, ఈటల రెండు చోట్ల పోటీ! చరిత్ర ఏం చెబుతుందంటే..

ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఉంది. ఇటీవలే నామినేషన్ల తిరష్కరణ, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి కావడంతో చివరగా బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తెలిపోయింది. ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నారు. ఇక గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓ ప్రత్యేకత ఉంది. మూడు ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ నేత ఈటల రాజేంద్రర్ రెండేసి స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇలా రెండు స్థానాల్లో పోటీ చేసే విషయంలో చరిత్ర ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. గులాబీ బాస్ కేసీఆర్.. తన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి  ఈసారీ ఎన్నికల బరిలో ఉన్నారు. అదే విధంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి..కొడంగల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. అలానే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు తమ రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం ఇదే ప్రథమం.

కేసీఆర్ గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసిన.. అందులో ఒకటి పార్లమెంట్ల్, రెండో అసెంబ్లీ. ఆ ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారు. అయితే రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడం ఇదే ప్రథమం. అయితే గతంలో ఎన్టీఆర్, పీవీ నరసింహరావు, వాజీపేయి, నరేంద్ర మోదీ వంటి ప్రముఖలు సైతం రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేసిన ఘటనలు ఉన్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరంల నుంచి పోటీ చేసి.. రెండు చోట్ల ఓడిపోయారు.

2009 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచి.. తిరుపతి స్థానంలో మాత్రమే గెలిచారు. ఎన్టీఆర్ 1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో గుడివాడ, హిందూపురం, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. నల్గొండ, గుడివాడను వదులుకుని హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో హిందూపురం, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలలో ఎన్టీఆర్ పోటీ చేశారు. హిందూపురంలో మాత్రమే ఎన్టీఆర్ విజయం సాధించారు. అలానే కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి, పెండ్యాల రాఘవరావు కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు.

ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మోదీ, పీవీ నరసింహరావు, వాజీపేయి వంటి ప్రధానాలు కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఇలా రెండు స్థానాల్లో పోటీ చేసిన స్థానాల్లో రెండూ చోట్ల గెల్చిన చరిత్ర ఉంది. అలానే ఓడిపోయిన చరిత్రలో ఉన్నాయి. మరి.. ఈసారీ తెలంగాణలో కేసీఆర్, రేవంత్, ఈటల ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో తెలియాలంటే.. డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. మరి.. ఇలా రెండు స్థానాల్లో పోటీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.