తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేఏ పాల్ బంపర్ ఆఫర్!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీట్ మీద ఉంది. ప్రధాన పార్టీలన్నీ హైస్పీడుతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లోకి  కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాక వివిధ పార్టీలకు చెందిన నేతలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీట్ మీద ఉంది. ప్రధాన పార్టీలన్నీ హైస్పీడుతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లోకి  కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాక వివిధ పార్టీలకు చెందిన నేతలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీట్ మీద ఉంది. ప్రధాన పార్టీలన్నీ హైస్పీడుతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రత్యర్థులపై  నేతలు మాటల తూటాలు పేలుస్తూ.. రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో ఎవరు గెలుస్తారు..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల్లోకి  కేఏ పాల్ ప్రవేశించారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివాళ్లు ప్రజాశాంతి పార్టీలో చేరండంటూ కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపు, ఓటములు పక్కన పెడితే..ప్రతి ఎన్నికల్లో ఆయన తప్పకుండా పోటీ చేస్తుంటారు. అంతేకాక తరచూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తాడు. గతంలో మునుగోడు ఉపఎన్నికల్లో డిఫరెంట్ గా  ప్రచారం చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన మాటలతో ప్రజల్లో కేఏ పాల్ ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా తెలంగాణలో పాల్ అన్న పాలన రాబోతోందని, ప్రజాశాంతి పార్టీ 79 సీట్లు గెలవబోతోందంటూ కేఏ పాల్‌ పేర్కొన్నారు.

తనకు 60శాతం ప్రజల మద్దతు ఉందని.. ప్రజాశాంతి పార్టీ టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉందన్నారు. ఇప్పటికే 18మంది అభ్యర్ధుల్ని ప్రకటించామని, రేపు మిగతా 101మంది అభ్యర్థులను ప్రకటిస్తానన్నారు. తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని.. పెన్షన్‌ను రూ.6వేలు చేస్తా, రైతుబంధు రూ.20వేలు చేస్తా అంటూ భారీగా హామీలు కురిపించారు.తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతోందని.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కాదు… ప్రజాశాంతి పార్టీనే ఫస్ట్‌ ఫోర్స్‌ అని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివాళ్లు ప్రజాశాంతి పార్టీలో చేరండని, అలాంటి వారిని తానే ఎమ్మెల్యేలుగా చేస్తానంటూ పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో ఏపీ ఎన్నికల గురించి కూడా కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమానికి కేఏ పాల్ మద్దతు తెలిపారు. ఎన్నికల తర్వాత స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తారని పేర్కొన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటానని హామి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తు ఉండొచ్చంటూ జోస్యం చెప్పారు. చంద్రబాబుతో అయినా కలిసి వెళ్తామంటూ కేఏ పాల్‌ స్పష్టం చేశారు. మరి.. కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments