Jishnu dev varma: తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ.. ఈయన ఎవరంటే?

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ.. ఈయన ఎవరంటే?

Jishnu dev varma: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది. తెలంగాణకు నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

Jishnu dev varma: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది. తెలంగాణకు నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ శర్మను నియమించింది. లోక్ సభ ఎన్నికల ముందు తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇంఛార్జ్ గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఈయనను మహారాష్ట్రకు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

జిష్ణు దేవ్‌ వర్మ ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ (66) నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. జిష్ణు దేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర శాసనసభలోని చారిలం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు.

Show comments