P Venkatesh
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఇప్పటికే మేనిఫెస్టలను ప్రకటించిన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నియోజక వర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో ఎన్నికలపై జనతా కా మూడ్ సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది.
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఇప్పటికే మేనిఫెస్టలను ప్రకటించిన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నియోజక వర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో ఎన్నికలపై జనతా కా మూడ్ సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది.
P Venkatesh
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. కాగా లీడర్లు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నియోజక వర్గాల్లో కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకుని విజయదుందుభి మోగించేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేస్తున్నాయి. కాగా తాజాగా జనతా కా మూడ్ టీఎస్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేపట్టి ఫలితాలను వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ ఎన్నికలపై మరో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ జనతా కా మూడ్ సర్వే సంచలన ఫలితాలను ప్రకటించింది. బుధవారం నాడు ఈ సర్వే ఫలితాలను ఢిల్లీ వేదికగా జనతా కా మూడ్ వ్యవస్థాపకులు భాస్కర్ సింగ్ విడుదల చేశారు. వీరి సర్వే ప్రకారం.. అధికార పార్టీ బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టబోతోందని వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 72 నుంచి 75 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. బీఆర్ ఎస్ పార్టీకి 41 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అదే విధంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 36 వరకు సీట్లు వస్తాయని వెల్లడించింది.
ఈ పార్టీకి 34 శాతం ఓట్లు దక్కనున్నాయని తెలిపింది. మరో జాతీయ పార్టీ బీజేపీకి 4 నుంచి 5 సీట్లు వస్తాయని జనతా కా మూడ్ సర్వే స్పష్టం చేసింది. ఈ పార్టీకి 14 శాతం మాత్రమే ఓట్లు పడనున్నట్లు తన సర్వేలో పేర్కొంది. వీటితో పాటు ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు గెలుపొందుతుందని తెలిపింది. ఇతరులు 00 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఇక ఈ సర్వే ద్వారా అధికారంలోకి రాబోతోందని వెల్లడైంది. కాంగ్రెస్ రెండో స్థానంతో, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోనున్నట్లు జనతా కా మూడ్ సర్వే తేల్చి చెప్పింది.
సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?
బీఆర్ఎస్ : 72 నుంచి 75 వరకు
కాంగ్రెస్ : 31 నుంచి 36 వరకు
బీజేపీ : 04 నుంచి 06 స్థానాల వరకు
ఎంఐఎం : 06 నుంచి 07 స్థానాల వరకు
ఇతరులు : 00 స్థానాలు