iDreamPost

Jabardasth: కొత్తగూడెంలో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి

  • Published Jun 22, 2024 | 10:02 AMUpdated Jun 22, 2024 | 10:02 AM

తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ ఒకరు రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. ఆ వివరాలు..

తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ ఒకరు రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 10:02 AMUpdated Jun 22, 2024 | 10:02 AM
Jabardasth: కొత్తగూడెంలో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి

నేటి కాలంలో రోడ్డు, రైలు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఈ క్రమంలో తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని ఓటీవీ ఆర్టిస్ట్‌ మృతి చెందాడు. జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున​ ఆర్టిస్ట్‌.. మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలు..

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి.. రైలు, పట్టాల మధ్య ఇరుక్కుని ఓ టీవీ ఆర్టిస్టు ప్రాణాలు కోల్పోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని మేదర మహ్మద్దీన్‌గా గుర్తించారు. ఇతడిది చుంచుపల్లి మండలం నందాతండా. ఇలా ఉండగా.. ప్రమాదం జరిగిన రోజు అనగా శుక్రవారం ఉదయం మహ్మద్దీన్‌.. భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.‌ ఇంతలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌ నుంచి ముందుకు కదులుతోంది. మహ్మద్దీన్‌.. ఆ రైలు ఎక్కాల్సి ఉంది. కానీ అది అప్పటికే కదులుతుండటంతో.. రన్నింగ్‌లో ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలును ఆపారు.

ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే.. రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను బయటకు తీసి.. కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మహ్మద్దీన్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడి నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలు అయ్యాయని తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో మమ్మద్దీన్‌కు ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం.. అతడిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మహ్మద్దీన్‌ను ఖమ్మం తరలించారు. అయితే దురదృష్టవశాత్తు.. అతడు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jabardasth artist died

మహ్మద్దీన్ టీవీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు.. ఈటీవీ జబర్దస్త్‌ షోలో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్‌లలో నటించాడు. ఈక్రమంలో హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉండటంతో.. దానిలో పాల్గొనడం కోసం వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు మహ్మద్దీన్‌. ఈక్రమంలోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, డిగ్రీ, పదోతరగతి చదివే ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారని తెలుస్తోంది. మహ్మద్దీన్‌ మృతితో నందాతండాలో విషాదచాయలు అలుముకున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు మహ్మద్దీన్‌. అతడి మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఇప్పుడు తమకు ఆధారం ఎవరని మహ్మద్దీన్‌ భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి