iDreamPost

ఉచిత బస్సు ప్రయాణంలో సమస్యలా? ఇలా చేయండి!

తెలంగాణలో కొత్త పథకం అమలు అవుతోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా పలు హామీలను ఇచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ నెల 9 అనగా.. శనివారం నుండి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేశారు.

తెలంగాణలో కొత్త పథకం అమలు అవుతోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా పలు హామీలను ఇచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ నెల 9 అనగా.. శనివారం నుండి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఉచిత బస్సు ప్రయాణంలో సమస్యలా? ఇలా చేయండి!

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించింది. ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని హస్తం పార్టీ హామీనిచ్చిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఈ పథకాలను అమలు చేసే ముసాయిదాపైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఈ నెల 9న తొలి స్కీం కింద మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు సీఎం.  తెలంగాణ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ఈ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌(జేబీఎస్)ను సోమవారం సజ్జనార్ తనిఖీ చేశారు. ఈ పథకం అమలు తీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. జేబీఎస్-జనగామ, జేబీఎస్-ప్రజ్ఞాపూర్, బాన్సువాడకు వెళ్లే బస్సులో ఉన్న మహిళా ప్రయాణీకులతో ముచ్చటించారు. మహాలక్ష్మి పథకంపై పలువురి మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జేబీఎస్- వెంకటరెడ్డి నగర్ సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణీకులకు జీరో టికెట్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి-మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసి.. 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని పేర్కొన్నారు.

మహిళలు, విద్యార్థినులు, బాలికలు, థర్డ్ జెండర్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్ధారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను.. ఆర్టీసీ సిబ్బందికి చూపించాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయగానే.. రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా మరిన్నీ బస్సులు నడిపేందుకు ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే ఎక్కడైనా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏవైనా పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటల పాటు కాల్ సెంటర్ నంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 040-69440000, 040-23450033 ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చునని చెప్పారు. మరీ ఈ పథకం అమలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి