iDreamPost
android-app
ios-app

టీడీపీకి భారీ షాక్‌.. అదే జరిగితే పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో కాసాని?

  • Published Oct 26, 2023 | 3:23 PM Updated Updated Oct 26, 2023 | 3:23 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజు రోజుకీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజు రోజుకీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

టీడీపీకి భారీ షాక్‌.. అదే జరిగితే పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో కాసాని?

తెలంగాణలో ఎన్నికల హడావుడి రసవత్తరంగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారం పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు తెగ కష్టపడుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ చేయడం ఖాయం.. కొన్ని పార్టీల్లో పోటీ విషయంపై తర్జన భర్జన కొనసాగుతుంది. అలాంటి వాటిలో టీడీపీ ఒకటి. నిన్నమొన్నటి వరకు అసలు టీడీపీ పోటీ చేస్తుందా? లేదా ? అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ విషయంపై పార్టీలోని నేతల నుంచి రక రకాల స్పందనలు వచ్చాయి. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సైతం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. గురువారం ఆయన రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ లో కలవనున్నారు.. ఆయన నిర్ణయంపైనే తెలంగాణలో టీడీపీ పోటీ చేసే అంశం ఆధారపడి ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ టీడీపీ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. టీడీపీలో కొనసాగిన ముఖ్యనేతలు అధికార పార్టీలోకి వెళ్లిపోయారు.  కొంతమంది నేతలు ఏ క్షణంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం గురించి పార్టీ నేతల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని నేడు చంద్రబాబు ని కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆయన 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 63 నియోజకవర్గాల లీస్టు కూడా సిద్దం చేసినట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీ పూర్తిగా బ్రస్టుపట్టిపోతుందన్న సమయంలో కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్ష పదవి చేపట్టి తెలంగాణలో మంచి ఊపు తీసుకువచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా తెలంగాణలో బైక్, కారు ర్యాలీల పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీకి పెద్ద దెబ్బ తగలబోతుందని మీడియాలో ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల సారాంశం ఏంటంటే.. తెలంగాణలో టీడీపీ పోటీ చేసేందుకు అధినేత నుంచి గ్రీన్ నిగ్నల్ వస్తే సరి.. లేదంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షులు  కాసాని గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.   ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ .. బీజేపీతో పొత్తు అంశంపై ఎలాంటి స్పష్టత రాేదు.. దీంతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీచేసే ఉద్దేశంలో ఉంది.

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలోపేతంగా ఉన్నాయి.. ఈ సమయంలో టీడీపీ పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కకుంటే ఆ ఎఫెక్ట్ ఏపీలో చూపించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తే.. పోటీ చేయకపోవడమే మంచిదని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు తో భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా టీడీపీకి కాసాని రాజీనామా చేసి.. ప్రత్యామ్నాయ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. 40 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ వచ్చినా రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ తీర్థం పుచ్చకున్న విషయం తెలిసిందే. రాజకీయాలు అన్న తర్వాత ఏదైనా జరగవొచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.