iDreamPost

ఇంత నిర్లక్ష్యమా.. బాలిక బడిలో ఉండగానే

కొన్ని సార్లు నిర్లక్ష్యం కారణంగా చాలా కోల్పోవలసి వస్తుంది. తాజాగా ఓ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మళ్లీ బడి అంటే భయపడిపోయాలా చేసింది.

కొన్ని సార్లు నిర్లక్ష్యం కారణంగా చాలా కోల్పోవలసి వస్తుంది. తాజాగా ఓ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మళ్లీ బడి అంటే భయపడిపోయాలా చేసింది.

ఇంత నిర్లక్ష్యమా.. బాలిక బడిలో ఉండగానే

గతంలో బడికి వెళ్లాలంటే ఆసక్తి చూపేవారు కాదు పిల్లలు. చదవాలంటే ఆసక్తి లేకపోవడంతో పాటు బడికి పోతే పంతులు కొడతారని భయంతో చాలా మంది పాఠశాలకు వెళ్లేవారు కాదు. హోం వర్క్ చేయకపోయినా, పాఠాలు చదవకపోయినా టీచర్స్ దండిస్తారన్న ఆందోళనను వ్యక్తం చేసేవారు. కడుపు నొప్పి అని, ఇతర కుంటి సాకులు చెబుతూ ఎగ్గొట్టేసేవారు. అయినప్పటికీ స్కూల్‌కు పోకపోతే చీపురు కట్ట తిరగేసేది అమ్మ, మందలించేవాడు నాన్న. కానీ కాలం మారినట్లు విద్యావ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన ప్రజల్లో కలిగింది. అక్షరాస్యత శాతంపై ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాయి. బడులకు వెళుతున్న వారి సంఖ్య పెరిగింది. అయితే ఓ సంఘటన బడి అంటేనే భయపెట్టేలా చేసింది ఆ చిన్నారిని.

బడి అంటే ఇష్టంతో రోజూ ఆడుతూ పాడుతూ వెళ్లే ఓ చిన్నారి.. సాయంత్రమైనా ఇంటికి చేరలేదు. దీంతో కంగారు పడ్డారు తల్లిదండ్రులు. ఎవరైనా ఎత్తుకు పోయారన్న ఆందోళన వ్యక్తం చేశారు. తెలిసిన వారిని, తోటి విద్యార్థులను అడిగారు. ఎవ్వరూ తెలియదని సమాధానం చెప్పడంతో.. పిల్ల జాడ కోసం వెతకసాగారు. పోలీసు కంప్లైంట్ ఇద్దామనుకున్న సమయంలోనే పాఠశాలలోనే పిల్ల ఉందని తెలిసి ఆనందం పడ్డారు. అంతలోనే బడిలో పాప ఉండగానే తాళం వేశారని తెలిసి ఆందోళన చెందారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాచు పల్లి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాచుపల్లి ఓ అపార్ట్ మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యం, ప్రభావతి దంపతులకు వేదాంజలి అనే కుమార్తె ఉంది.

వేదాంజలి స్థానిక ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. రోజులానే స్కూల్‌కు వెళ్లిన చిన్నారి.. బడి మూసేసిన తర్వాత ఇంటికి రాలేదు. పిల్ల రాలేదీ ఏంటని బడి దగ్గరకు వెళ్లే సరికి తాళం వేసి ఉంది. చుట్టు ప్రక్కల మొత్తం వెతికారు. తెలిసిన వాళ్లని అడిగారు. అయితే పాఠశాల వద్ద మరోసారి వెతుకుతుండగా.. పాప ఏడుపు వినిపించింది. దీంతో బడిలో ఉందని గ్రహించిన తల్లిదండ్రులు.. చుట్టు ప్రక్కల వారి సహాయంతో పాఠశాల తరగతి గది తాళం పగుల కొట్టారు. లోపల చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది తల్లిదండ్రులకు. అయితే స్కూల్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. పిల్లలు బయటకు వెళ్లారా లేదా అని చూడకుండా ఆయా తలుపులు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి