iDreamPost

విద్యా సంస్థల్లో లేట్ ఫీజులపై వడ్డీలు? వెలుగులోకి దారుణమైన నిజాలు!

Private Schools Fees: తమ బిడ్డల భవిష్యత్ బాగుండేందు తల్లిదండ్రులు ఆశ పడుతుంటే.. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని  కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు బాదుతున్నా. ఇప్పటికే ఈ విద్యాసంస్థల ఫీజుల దోపిడికి చాలా మంది పేరెంట్స్ అల్లాడిపోతున్నారు. తాజాగా మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Private Schools Fees: తమ బిడ్డల భవిష్యత్ బాగుండేందు తల్లిదండ్రులు ఆశ పడుతుంటే.. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని  కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు బాదుతున్నా. ఇప్పటికే ఈ విద్యాసంస్థల ఫీజుల దోపిడికి చాలా మంది పేరెంట్స్ అల్లాడిపోతున్నారు. తాజాగా మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది.

విద్యా సంస్థల్లో లేట్ ఫీజులపై వడ్డీలు? వెలుగులోకి దారుణమైన నిజాలు!

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను గొప్పగా చదివించి… ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. అందుకే రేయింబవళ్లు కష్టపడి..బిడ్డలను చదివిస్తుంటారు. మంచి స్కూల్ లో చదివించాలనే  భావనతో తలకు మించిన భారం మీద వేసుకుని పిల్లలను చదివిస్తుంటారు. ఇక కొన్ని విద్యాసంస్థలు తల్లిదండ్రుల బలహీనతు ఆసరాగా చేసుకుని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. లేటు ఫీజుకు వడ్డీ కూడా వసూలు చేస్తామంటూ ఏకంగా సర్క్యూలర్ పంపినారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తమ బిడ్డల భవిష్యత్ బాగుండేందు తల్లిదండ్రులు ఆశ పడుతుంటే.. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని  కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు బాదుతున్నా. ఇప్పటికే ఈ విద్యాసంస్థల ఫీజుల దోపిడికి చాలా మంది పేరెంట్స్ అల్లాడిపోతున్నారు. అంతేకాక ఈ ఫీజులపై అనేక  విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏటా అడ్డగోలుగా స్కూల్స్ ఫీజులు పెంచుతున్నాయి. ఈ వీటిపై నియంత్రణ లేకపోగా.. ఇప్పుడు ఏకంగా ఆలస్యంగా ఫీజుల చేలిస్తే ..వాటిపై  స్కూల్ యాజమాన్యాలు వడ్డీలు కట్టించుకుంటున్నాయి సమాచారం. ఇదేదో తల్లిదండ్రులకు పిలిచి మరీ చెప్పిన మాట కాదండి. ఏకంగా వారి ఇళ్లకు పంపుతున్న సర్క్యులర్స్.

ఏ నెలలో ఎంత ఫీజు కట్టాలి, లేటుగా కడితే  ఎన్ని నెలలకు ఎంత వడ్డీ వేస్తున్నది స్పష్టంగా వివరిస్తూ స్కూల్ లెటర్ హెడ్ పై రాసి మరీ పేరెంట్స్ కి పంపిస్తున్నాయి. హైదరాబాద్ లోని   మీర్ పేట్ లోని  ఓ ప్రైవేటు స్కూల్ ఆగడాలు బయటకు వచ్చాయి.  జూన్ లో స్కూల్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి ఫీజుల షరతులకు సంబంధించి సర్క్యూలర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆలస్యం లేకుండా ఫీజులు చెల్లిస్తే..  ఎటువండి వడ్డీ ఉండదట. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి 6 నెల్లలో ఫీజు మొత్తం కడితే వడ్డీ ఉండదంట. అలా కాకుండా  9 నెలలకు కడితే 2 శాతం , ఇక11 నెలలకు కడితే 3 శాతం  వడ్డీ కట్టాల్సి ఉంటుందంటూ సర్క్యులర్స్ లో చూపించింది.

ఆ స్కూల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో విద్యాను బోధిస్తున్నారా లేకా వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అంటూ పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు.  ప్రభుత్వం స్పందించి విద్యా సంస్థలఫీజులను కంట్రోల్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  ఇలా చాలా పాఠశాల్లో జరుగుతుందని పేరెంట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో పాటు  చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కూడా భారీగా స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి