iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌ హోటల్లో మరో దారుణం.. పూరీ తింటుండగా ప్రత్యక్షమైన వింత జీవి!

ఇంట్లో చేసుకునేే ఓపిక లేకో లేదా సమయం లేకపోవడంతో చాలా మంది టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని హోటల్స్ సైతం నాణ్యత లేని వస్తువులు కస్టమర్లకు అందిస్తున్నాయి. అందుకు సాక్షాలుగా నిలిచాయి హైదరాబాద్ హోటల్స్.

ఇంట్లో చేసుకునేే ఓపిక లేకో లేదా సమయం లేకపోవడంతో చాలా మంది టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని హోటల్స్ సైతం నాణ్యత లేని వస్తువులు కస్టమర్లకు అందిస్తున్నాయి. అందుకు సాక్షాలుగా నిలిచాయి హైదరాబాద్ హోటల్స్.

హైదరాబాద్‌ హోటల్లో మరో దారుణం.. పూరీ తింటుండగా ప్రత్యక్షమైన వింత జీవి!

ఇటీవల హోటల్స్‌కు వెళ్లి తిందామంటే బాబోయ్ అనే సంఘటనలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. బయటకేమో రిచ్ లుక్ ఇచ్చే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లోపల డొల్లతనం బయటపడింది. కల్తీ లేదా నిల్వ చేసిన ఆహార పదార్థాలు, కుళ్లిన లేదా పాడైపోయిన, డేట్ ముసిగిపోయిన వస్తువులను వినియోగిస్తూ..నాణ్యత ప్రమాణాలు గాలికొదిలేసి కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడారు హోటల్ యజమానులు. ఒక్కటనే కాదు.. చిన్న హోటల్స్ నుండి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు ఇదే బాపత్తు. ఇక హోటల్లో తినే పదార్థాల్లో జీవాలు కనిపించడం కామన్.

ఇప్పటికే బిర్యానీ, ఐస్ క్రీం వంటి జనాలు ఎక్కువ తినే ఆహార పదార్థాల్లో వేళ్లు, బొద్దింకలు, ఈగలు వచ్చిన ఘటనలు చూశాం. ఇప్పుడు మరో హోటల్లో ఇటువంటి నిర్వాకమే బయటపడింది. టిఫిన్ చేద్దామని వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని గడ్డి అన్నారంలోని ప్రముఖ హోటల్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌కు వెళ్లిన కస్టమర్ పూరి ఆర్డర్ చేశాడు. వెయిటర్ తీసుకురాగానే.. టకా టకా పూరీని కూరలో నంచుకుని తినేశాడు. అంతలో కూరలో ఏదో తగులుతుండగా చూశాడు. దెబ్బకు షాక్ తిన్నాడు. అందులో పురుగు కనిపించింది. వెంటనే అక్కడ ఉన్న వారికి చెప్పగా.. అస్సలు పట్టించుకోలేదు.

తిరిగి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు వెయిటర్. మళ్లీ ఈ మిస్టేక్ చేయమని చెప్పడం కానీ..  కనీసం సారీ సార్ అని కూడా చెప్పలేదు. చివరకు అతడు బిల్లు కూడా చెల్లించాడు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ఇంట్లో చేసుకునేే ఓపిక లేకపోవడం వల్లో లేదా సమయం లేకపోవడంతో, వీకెండ్ ఫ్యామిలీతో బయటకు వెళదామని అనుకునేవారంతా  టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు.  ఇదే అదునుగా తీసుకుని హోటల్స్ సైతం నాణ్యత లేని వస్తువులు కస్టమర్లకు అందిస్తున్నాయి.  డబ్బులు దండిగా తీసుకుని నాణ్యత లేని పదార్థాలను వడ్డి వారుస్తున్నాయి.  అందుకు సాక్షాలుగా నిలిచాయి హైదరాబాద్ హోటల్స్.