iDreamPost
android-app
ios-app

తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో ఏకధాటి వర్షాలు!

కొన్ని రోజుల వరకు ఎండలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అదరగొట్టినాయి. అంతేకాక అప్పుడప్పుడు తొలకరి వానలు పలకరించి వెళ్లేవే. ఇలా వానల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

కొన్ని రోజుల వరకు ఎండలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అదరగొట్టినాయి. అంతేకాక అప్పుడప్పుడు తొలకరి వానలు పలకరించి వెళ్లేవే. ఇలా వానల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో ఏకధాటి వర్షాలు!

ఇప్పటి వరకు ఎండలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అదరగొట్టినాయి. అంతేకాక అప్పుడప్పుడు తొలకరి వానలు పలకరించి వెళ్లేవి. అయితే వ్యవసాయానికి అవసరమై వానాలు మాత్రం కురవలేదు. దీంతో రైతులు వానల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఏటా ఈ సమయానికి నైరుతి రుత పవనాలు ప్రభావంతో వర్షాలు కురిసేవి. అయితే ఈ సారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిరాశ తప్పలేదు. ఇలా వానాల కోసం ఎదురు చూస్తున్న రెండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్త అందిందనే చెప్పాలి. మరో రెండు రోజుల్లో వానలు ప్రారంభమైయ్యే ఏకధాటి కురుస్తాయని ఇండో జర్మన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో చిన్నపాటి వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో.. ఆప్రభావంతో వానాలు కురుస్తున్నాయి. అయితే ఏటా మాదిరిగా సరైన టైమ్ కి కాకుండా ఈ సారి కాస్తా ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇక ఉత్తరాధి రాష్ట్రాల్లో అయితే మాన్ సూన్ ప్రభావం ఇంకా కనిపించడం లేదు. ఢిల్లీ, హర్యానా వంటి నార్త్ ఇండియా ప్రాంతాల్లో అయితే ఇంకా ఎండలు మండిపోతున్నాయి. రుతుపవనాల రాక, వాటి ప్రభావం ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రుతు పవనాలు ఆలస్యం వస్తున్నాయి.

ఒక్కోసారి విపరీతంగా అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇందుకు కారణం ఏంటీ.. ఎందుకు రుతు పవనాలు ఆలస్యం లేదా ముందు రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రుతుపవనాల వచ్చే సమయంలో ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నాయి. ఇలాంటి అంశాలపై ఇండో జర్మన్ సైంటిస్టుల పరిశోధనలు చేశారు. దాదాపు పది ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి..భారత దేశం.. అందులోనూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, అందుకు కారణాలు గల కారణాలను, అలాగే వర్షాలపై అంచనాలు వేశారు.

ఇక ఈ నిపుణుల బృందం అంచనాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మరో రెంజు రోజుల తరువాత అంటే జూన్ 20 తర్వాత ఏకధాటి వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణలో జూన్ 22న, తూర్పు తెలంగాణలో జూన్ 21న  వానలు పడనున్నాయి.  ఆ రెండు రోజుల తరువాత తెలంగాణ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ఇండో జర్మన్ నిపుణుల బృందం అంచనా వేసింది. ఇలా ఏకధాటికా వానాలు పడినప్పటికీ తెలంగాణ వర్షం శాతం తక్కువేనని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా  మరో రెండు రోజుల తరువాత ఏకధాటి వానాలు అనే విషయంలో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.