వారం రోజులుగా అమెరికాలో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం! ఆందోళనలో కుటుంబం

Indian Student in Chicago Missing: ఇటీవల విదేశాలకు వెళ్లే భారతీ విద్యార్థులపై ఎన్నో దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ పిల్లలు భద్రత విషయంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Indian Student in Chicago Missing: ఇటీవల విదేశాలకు వెళ్లే భారతీ విద్యార్థులపై ఎన్నో దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ పిల్లలు భద్రత విషయంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించి సమాజంలో గొప్ప పొజీషన్లో ఉంచాలని తపన ఉంటుంది. ఇందుకోసం తమ అర్హతకు మించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిస్తుంటారు.ఇటీవల విదేశాల్లో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పలు బ్యాంకులు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు స్కాలర్ షిప్ పై వెళ్తున్నారు.  ఇటీవల విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు కిడ్నాప్, హత్యలకు గురి కావడం తల్లిదండ్రులను కలవపెడుతున్నాయి. అమెరికాలో తెలంగాణ విద్యార్థి గత వారం రోజులు కనిపించకుండా పోయాడు. ఆ విద్యార్థికి ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్న భారతీ విద్యార్థులపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటారు. మరికొంతమంది హాస్టల్స్ లో ఉండి చదువుకుంటారు. ఈ మధ్య విదేశాల్లో భారతీయ విద్యార్థులను డబ్బు కోసం కిడ్నాప్ చేయడం, హత్యలకు తెగబడుతున్నారు.కొంతమంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కారణాలు ఏవైనా తమ కళ్ల ముందు ఉండాల్సిన పిల్లలు ఖండాలు దాటి చనిపోతుంటే తల్లిదండ్రులు ఆవేదన వర్ణణాతీతం. తాజాగా తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రూపేశ్ చంద్ర  చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడని. ఇలా కనిపించకుండా పోవడానికి గల కారణాలు ఏంటో అర్థం కావడం లేదని సన్నిహితులు, చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు.

అమెరికా చికాగోలో భారత విద్యార్థి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతుంది. మే 2 నుంచి తెలంగాణకు చెందిన విద్యార్థి చింతకింది రూపేశ్ చంద్ర కనిపించకుండా పోయినట్లు చికాగో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారుర. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్సిటలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేష్ కనిపించకుండా పోయిన విషయం తెలిసి తల్లిదండ్రుల భయంతో వణికిపోతున్నారు. తమ కొడుకు ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల తమ దేశంలో విదేశీ విద్యార్థులకు భద్రతకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.

Show comments