Arjun Suravaram
Telangana Rain Alert: గత రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములతో కూడిన వానలు కురిశాయి. నేడు కూడా రాష్ట్రాల ప్రజలకు ఓ కీలక అలెర్ట్ జారీ అయ్యింది.
Telangana Rain Alert: గత రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములతో కూడిన వానలు కురిశాయి. నేడు కూడా రాష్ట్రాల ప్రజలకు ఓ కీలక అలెర్ట్ జారీ అయ్యింది.
Arjun Suravaram
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలకు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. ఉరుములతో కూడిన వానలు కురిశాయి. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వానలు వదల్లేదు. నేడు కూడా రాష్ట్రాల ప్రజలకు ఓ కీలక అలెర్ట్ జారీ అయ్యింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలో వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవనున్నాయి. అలానే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని ఐఏండీ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప పొలాలకు, బయట ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బుతుపవనాల ద్రోణి ప్రభావం వల్ల మరో రెండ్రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో తో పాటు ఏపీ లో కూడా గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వానల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను పైకెత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నుంచి ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా నేడు తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.