iDreamPost
android-app
ios-app

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

  • Published May 14, 2024 | 10:17 AM Updated Updated May 14, 2024 | 10:17 AM

రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు వాతావరణ శాఖ మరో మూడు రోజులు పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు.

రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు వాతావరణ శాఖ మరో మూడు రోజులు పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు.

  • Published May 14, 2024 | 10:17 AMUpdated May 14, 2024 | 10:17 AM
తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వాతవరణంలో భిన్నమైన మార్ఫులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓ వైపు భగ భగ మంటూ ఎండలు దంచికొడుతున్నాయి. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా వేళ.. గత వారం రోజుల నుంచి వాతవరణం చల్లబడింది. కాగా, పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పగటి పూట ఎండలు దంచికొడుతుంటే.. మరో వైపు సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు అనగా ఈనెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.  అంతేకాకుండా.. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు.

Heavy rains in those districts

అయితే ఆ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుందని.. మరి కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందన్నారు. అలాగే ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. కాగా, నేడు మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

ఇక బుధవారం మే 15వ తేదీన పై జిల్లాతోపాటు సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌ నగరంలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మాగ్జిమం 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు. మరి, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.