iDreamPost

తెలంగాణ‌లో రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణ‌లో రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. పది రోజుల నుంచి తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణలో వాతావరణంలో మార్పులు సంభవించాయి. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన మార్పులు వల్ల 27 నాటికి తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగానే నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉండాలని.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఏర్పడిన మార్పులు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, ఆసీఫాబాద్, ఆదిలాబాద్, నిజమాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాల ప్రభావం వల్ల ఉదయం పూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా ఎన్నికల ప్రచారాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మరోవైను భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి