iDreamPost
android-app
ios-app

వదలనంటున్న వానలు.. తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

TG Rains: తెలంగాణలో వానలు ఇప్పట్లో తగ్గేలా లేవు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

TG Rains: తెలంగాణలో వానలు ఇప్పట్లో తగ్గేలా లేవు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వదలనంటున్న వానలు.. తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక హైదరాబాద్ లో జోరు వానలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలతో పట్టపగలే చీకట్లు కమ్ముకుని కుండపోత వాన పడుతుంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

వర్షాలు ఇక చాలు బాబోయ్ అంటుంటే వరుణుడు మాత్రం వదిలేలా లేడు. తెలంగాణలో 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాడు నిర్మల్‌, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

శనివారం నాడు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.