Tirupathi Rao
IMD Hyderabad Issues Yellow Alert: తెలంగాణలో రానున్న నాలుగురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
IMD Hyderabad Issues Yellow Alert: తెలంగాణలో రానున్న నాలుగురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Tirupathi Rao
నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గత మూడ్రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలావరకు నగరవాసులు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అందులోనూ హైదరాబాద్ మహానగంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు హెచ్చరించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయిపోయారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణలో కాకుండా కోస్తాఆంధ్రా, కర్ణాటకలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే వరుసగా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తడిసి ముద్దయిపోయారు. ఇప్పుడు వచ్చే నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అలాగే జీహెచ్ ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మీకు ఏదైనా సమస్య ఎదురైతే అత్యవసర సమయాల్లో సహాయం కోరేందుకు నంబర్లను ఏర్పాటు చేశారు. 040-21111111, 9001136675 నంబర్లను సంప్రదించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్. యాదాద్రి- భువనగిరి, మల్కాజ్ గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్ పేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురవడమే కాకుండా.. గాలి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే జూన్ 10, 11 తేదీల్లో.. అంటే సోమవారం, మంగళవారం రోజున వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీలోని యానాంలో ఆదివారం, సోమవారం ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఆదివారం, సోమవారం గంటకు 40 కిలోమీటర్ల వేగంగా గాలి వీస్తుంది. అక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా రానున్న మూడ్రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. అలాగే పలుచోట్ల వర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరించారు.