Arjun Suravaram
IMD Heavy Rain Alert To Telangana: బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఐఎండీ కీలక అప్ డేట్ ఇచ్చింది.
IMD Heavy Rain Alert To Telangana: బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఐఎండీ కీలక అప్ డేట్ ఇచ్చింది.
Arjun Suravaram
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా భారీ వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగుస్టేట్స్ లో గత కొన్ని రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
కొన్ని రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందన్నారు. ఈకారణంగా రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి రేపు.. అనగా ఆగష్టు 31వ తేదీన వాయుగుండా మారే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈ నేపథ్యంలోనే శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వానాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలానే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రేపు అనగా శనివారం, ఆగష్టు 31నాడు మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. అదే విధంగా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలు ఎల్లో , ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వానలు పడనున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.