iDreamPost
android-app
ios-app

వాతావరణ శాఖ అలర్ట్.. మరో మూడురోజులు వర్షాలు

  • Published Aug 19, 2024 | 8:09 AM Updated Updated Aug 19, 2024 | 8:09 AM

Rain Alert: తెలంగాణ రాష్ట్రానికి  వర్షాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పైగా నేడు తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతల్లో తేలికపాటి జల్లులు కురుశాయి. ఈ  క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో వాతవరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

Rain Alert: తెలంగాణ రాష్ట్రానికి  వర్షాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పైగా నేడు తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతల్లో తేలికపాటి జల్లులు కురుశాయి. ఈ  క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో వాతవరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

  • Published Aug 19, 2024 | 8:09 AMUpdated Aug 19, 2024 | 8:09 AM
వాతావరణ శాఖ అలర్ట్.. మరో మూడురోజులు వర్షాలు

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కుండపోతు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ భారీ వర్షాలు కారణంగా.. కొన్ని ప్రాంతల్లో అయితే నదులు, చెరువులు, కాలువలు పొంగిపోయి ఇళ్లలోకి నీళ్లు చేరిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే వాతవరణంలో చాలా మార్పలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే..  ఉదయం పూట విపరీతమైన ఎండ పెట్టి, మధ్యహ్నం సమయంలో మబ్బులు, గాలులు వీస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా తరుచు రాష్ట్రంలో తేలికపాటి జల్లలు కురుస్తున్నాయి. కానీ, నేడు తెల్లవారు జామునే రాష్ట్రాంలో తేలికపాటి జల్లులు కురుశాయి. ఈ క్రమంలోనే.. తాజాగా రాష్ట్రంలో వాతవరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ను  జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కురవనున్నయని, ముఖ్యంగా నేడు ఈ జిల్లాలో భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రానికి  వర్షాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పైగా నేడు తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతల్లో తేలికపాటి జల్లులు కురుశాయి. ఈ  క్రమంలోనే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని తాజాగా వాతవరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. నేడు  భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేశారు.

rain alert for 3 days

అలాగే వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట,యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే ఈ భారీ వర్షాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరించింది.

ఇకపోతే ఆదివారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోఠి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్‌, తార్నాక, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై వర్షపు నీరు నిలచిపోటవంతో చాదర్‌ఘాట్‌ నుంచి ఎల్బీనగర్‌వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివిధ చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.