iDreamPost
android-app
ios-app

మరో సంచలన నిర్ణయం తీసుకున్న Hydra.. వారికి గట్టి షాక్!

  • Published Oct 18, 2024 | 11:55 AM Updated Updated Oct 18, 2024 | 11:55 AM

Hydra: హైడ్రా కూల్చివేతలపై విమర్శలు తగ్గట్లేదు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Hydra: హైడ్రా కూల్చివేతలపై విమర్శలు తగ్గట్లేదు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరో సంచలన నిర్ణయం తీసుకున్న Hydra.. వారికి గట్టి షాక్!

హైడ్రా కూల్చివేతలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా విరుచుకుపడుతుంది. అందుకే ఆ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది. గత రెండు మూడు నెలల నుంచి వందలాది ఇళ్లను నేల మట్టం చేశారు హైడ్రా అధికారులు. అక్రమ కట్టడాలు కూల్చడం మంచి నిర్ణయమే అయినా దీని వలన అమాయకపు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. హైడ్రా కూల్చివేతల వలన రోడ్డున పడుతున్నారు. ఎవరో చేసిన తప్పుకు సామాన్య ప్రజలు బలి కావడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. రోజు రోజుకు ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు ఎక్కువవుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. పేదల ఇళ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం చాలా అన్యాయమని బాధలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని, వీళ్ళు చేసిన మోసానికి పాపం పేదలు నష్టపోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ జోన్ అనేవి పెద ప్రజలకు ఎలా తెలుసని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయాలు తెలీకుండా పెద ప్రజలు బిల్డర్ల నుంచి ఇళ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరోక సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. ఇక బిల్డర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం వారిపై కేసులు నమోదవుతున్నాయి. అలాగే నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల్లో నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం బిల్డర్ల నుంచి డబ్బులు రికవరీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారి దగ్గర నుంచి రికవరీ చేసిన డబ్బులను బాధితులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ కూడా హైడ్రా కూల్చివేతల విషయంలో ప్రభుత్వంపై జనాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే ఈ నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇలా బిల్డర్ల మోసానికి బలైపోయే పేదలను ఆదుకోవాలని అధికారులు ఫిక్స్ అయ్యారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు బిల్డర్ల నుంచి పూర్తిగా నష్ట పరిహారం ఇప్పించ్చేందుకు ఇప్పటికే యాక్షన్ లోకి దిగారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని గురించి ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని విక్రమార్క సూచించారని తెలిసింది. ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇప్పటికే కొంతమంది బిల్డర్లని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారట. అలాగే మిగిలిన బిల్డర్లపై కూడా కేసులు నమోదు చేసి వారి నుంచి ప్రజలకు రావలసిన నష్ట పరిహారాన్ని ఇప్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇది సంగతి. మరి ఈ విషయం పై మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.