iDreamPost
android-app
ios-app

గాల్లో డబ్బులు ఎగరేస్తూ యూట్యూబర్ హర్ష హల్ చల్.. అరెస్ట్ చేయాలంటూ..

  • Published Aug 22, 2024 | 8:02 PM Updated Updated Aug 22, 2024 | 8:02 PM

YouTuber Harsha: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై గాల్లోకి డబ్బులు ఎగరేస్తూ నానా రచ్చ చేశాడు. ఈ ఘటనపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

YouTuber Harsha: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై గాల్లోకి డబ్బులు ఎగరేస్తూ నానా రచ్చ చేశాడు. ఈ ఘటనపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

  • Published Aug 22, 2024 | 8:02 PMUpdated Aug 22, 2024 | 8:02 PM
గాల్లో డబ్బులు ఎగరేస్తూ యూట్యూబర్ హర్ష హల్ చల్.. అరెస్ట్ చేయాలంటూ..

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ కి పైత్యం బాగా ముదిరిపోతోంది. సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయ్యేందుకు ఇష్టం వచ్చిన రీతిలో రిల్స్, వీడియోలు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. తోటి వారికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారు. నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ.. కరెన్సీని గాల్లో ఎగరేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇదే రీతిలో హైదరాబాద్ రోడ్లపై యూట్యూబర్ హర్ష హల్ చల్ చేశాడు. డబ్బును గాల్లోకి విచ్చల విడిగా ఎగరేస్తూ పిచ్చిగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో యూట్యూబర్ హర్ష నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. గాల్లో డబ్బులు ఎగరేస్తూ.. రోడ్డుపై స్టంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డబ్బుల కోసం ప్రజలు రోడ్డుపై పరుగెడుతున్నారు. యూట్యూబర్ చేసే రచ్చ వల్ల వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారని నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు వ్యూవర్స్ కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యూస్ కోసం, లైకులు, కామెంట్ల కోసం యూట్యూబర్ హర్ష ఎంతకైనా తెగించేలా ఉన్నాడు. ఇది వరకు కూడా ఇలాగే డబ్బులను గాల్లోకి వెదజల్లి రీల్స్ చేస్తూ తన పైత్యాన్ని ప్రదర్శించేవాడు. హైదారాబాద్ రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. రద్దీగా ఉండే రోడ్లపై డబ్బు వెదజల్లడం వల్ల వాటిని పట్టుకునేందుకు జనం ఎగబడతారు. దీని వల్ల ట్రాఫిక్ జామ్, తొక్కిసలాట కూడా జరుగుతుంది. ఈ విధంగా ఇతరులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరించే యూట్యూబర్ హర్షపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetup girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom