iDreamPost
android-app
ios-app

అక్రమ నిర్మాణం కూల్చివేత.. సివంగిలా తిరగబడ్డ ఆడపులి.. JCB నా మీద నుంచి పోనియ్ అంటూ..

హైదరాబద్ లోని మైలార్ దేవ్ పల్లిలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ యువతి ఆడపులిలా తిరగబడి జేసీబీని అడ్డుకుంది.

హైదరాబద్ లోని మైలార్ దేవ్ పల్లిలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ యువతి ఆడపులిలా తిరగబడి జేసీబీని అడ్డుకుంది.

అక్రమ నిర్మాణం కూల్చివేత.. సివంగిలా తిరగబడ్డ ఆడపులి.. JCB నా మీద నుంచి పోనియ్ అంటూ..

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఆకస్మిక కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు తమ గూడు చెదిరి పోతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో హడలెత్తిపోతున్నారు. చెరువులు, నాలాలు, బఫర్ జోన్స్, ఎఫ్ టీఎల్ పరిధిలోని స్థలాల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తూ దడ పుట్టిస్తున్నారు. అదే విధంగా అనుమతులు లేని నిర్మాణాలను కూడా కూల్చి వేస్తూ అధికారులు షాక్ ఇస్తున్నారు.

ఈ క్రమంలో నగర పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో రెవెన్యూ అధికారులు కూల్చి వేతలు ప్రారంభించారు. దీంతో ఆ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ యువతి కూల్చివేతలపై సివంగిలా తిరగబడింది. జేసీబీకి అడ్డుగా నిలబడి కూల్చి వేతలను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆడపులి మాదిరిగా ధైర్యం చూపుతూ జేసీబీ నా మీద నుంచి పోనియ్ అంటూ సవాల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. ఈ స్థలాన్ని ఇతరులకు విక్రయించారు. అది ప్రభుత్వ స్థలమని తెలియక స్థలం కొన్నవారు కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు.

అది అక్రమ నిర్మాణమని తేలడంతో అధికారులు కూల్చి వేతకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను టీఎన్జీవోస్ కాలనీలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను బాధితులు అడ్డుకున్నారు. ఓ యువతి జేసీబీని అడ్డుకుని హల్ చల్ చేసింది. జేసీబీ తన మీద నుంచి పోనియ్యమంటూ యువతి తిరగబడింది. పోలీసులు ఆ యువతిని పక్కకు లాగారు. దీంతో బాధితులకు, రెవెన్యూ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి జేసీబీ అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్షల రూపాయలు పెట్టి స్థలాన్ని కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తున్న జేసీబీకి అడ్డుగా నిలబడి తిరగబడిన యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.