iDreamPost
android-app
ios-app

హైదరాబాద్: RTC ప్రయాణికులకు గుడ్ ‌న్యూస్.. ఇకపై ఆ రూట్ ‌లో ప్రత్యేక సర్వీసులు

  • Published Aug 09, 2024 | 4:51 PM Updated Updated Aug 09, 2024 | 4:51 PM

Hyderabad: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక బస్సులను అదనంగా వేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Hyderabad: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక బస్సులను అదనంగా వేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Aug 09, 2024 | 4:51 PMUpdated Aug 09, 2024 | 4:51 PM
హైదరాబాద్: RTC ప్రయాణికులకు గుడ్ ‌న్యూస్.. ఇకపై ఆ రూట్ ‌లో ప్రత్యేక సర్వీసులు

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో.. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, విద్యార్థినులు, యువతలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్ సంగతి తెలిసిందే. దీంతో నగరంలో ఆర్టీసీ బస్సు ప్రయాణంకు ఎనలేని ప్రాధాన్యత వచ్చిది. అంతేకాకుండా.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో బస్సులు తక్కువగా ఉండటంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం అదనంగా సీటీ ఆర్టీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్,ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సులను వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాలకు వెళ్లలసిన ప్రయాణికులు సరైన సమాయానికి బస్సులు లేక, రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గంటలు, గంటలు ఈ బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

Good news for RTC commuters

తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ.. ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై నగరంలో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ వరకు ప్రత్యేక బస్సులు నడవునున్నారట. ముఖ్యంగా నేటి నుంచే రామోజీ ఫిల్మ్ సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ(205F) బస్సులు నడపనున్నట్లు తాజాగా కాచిగూడ డిపో మేనేజర్ తెలిపారు. అయితే ఈ బస్సలు అనేవి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున రాకపోకలు సాగించనున్నరట. ఇకపోతే రాత్రి రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సులు ఉంటుందన్నారు.

అలాగే అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు బస్సు ఉంటుందని, అది కూడా ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుందని తెలిపారు. అయితే ఇక్కడ రాత్రి 10 గంటల వరకు బస్సులు నడుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రత్యేక బస్సు సర్వీసు అనేది నల్గొండ చౌరస్తా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. కనుక ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారలు వెల్లడించారు. మరీ, రాష్ట్రంలో ఇక నుంచి ఈ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.