వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఏకంగా 10రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయంటే?

వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఏకంగా 10రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయంటే?

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇక పండగలు, ర్యాలీలు, ప్రధాని, రాష్ట్రపతి పర్యటనలప్పుడు ఇంకా హెవీగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తుంటారు. కిలోమీటర్ దూరానికి కూడా అరగంట పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరం గణేష్ ఉత్సవాలకు సిద్ధమైంది. ఇప్పటికే వాడ వాడలో గణేష్ మండపాలు వెలిశాయి. గణనాథులు మండపాల్లో కొలువుదీరనున్నారు. గణేష్ నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏకంగా 10 రోజులపాటు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేష్‌ ను దర్శించుకునేందుకు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. వినాయకుడికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ తోపాటు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

  • ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి రాజీవ్‌ గాంధీ విగ్రహం మీదుగా మింట్‌ కాంపౌండ్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నిరంకారి జంక్షన్ వైపు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
  • పాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఖైరతాబాద్‌ గణేష్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ రాజ్‌దూత్‌ లైన్‌లోకి అనుమతించరు.
  • ఇక్బాల్‌ మినార్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ లేన్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ అనుమతించరు.
  • ఎన్టీఆర్‌ మార్గ్‌, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోడ్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వైపు వచ్చే సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు.
  • నెక్లెస్‌ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్‌ లేదా ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.
  • ఖైరతాబాద్‌ పోస్టాఫీస్‌ లేను ఖైరతాబాద్‌ రైల్వే గేటు వైపు అనుమతించరు.
  • నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్‌ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు వాహనాల కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్
  • స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ంగ్‌ సదుపాయం కల్పించారు.
  • సెలవు రోజుల్లో ఖైరతాబాద్ బడా గేణేశుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్ ప్రాంతాలు రద్దీగా ఉంటాయని, ఈ మార్గాల్లో వావాహనదారులు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Show comments