P Venkatesh
వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఏకంగా 10రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయంటే?
వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఏకంగా 10రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయంటే?
P Venkatesh
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇక పండగలు, ర్యాలీలు, ప్రధాని, రాష్ట్రపతి పర్యటనలప్పుడు ఇంకా హెవీగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తుంటారు. కిలోమీటర్ దూరానికి కూడా అరగంట పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరం గణేష్ ఉత్సవాలకు సిద్ధమైంది. ఇప్పటికే వాడ వాడలో గణేష్ మండపాలు వెలిశాయి. గణనాథులు మండపాల్లో కొలువుదీరనున్నారు. గణేష్ నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏకంగా 10 రోజులపాటు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేష్ ను దర్శించుకునేందుకు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. వినాయకుడికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ తోపాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.