iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం.. ఆ రూట్లలో అస్సలు వెళ్లకండి

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వాన నగరవాసులను వణికించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాదాపు నగరమంతా వర్షం కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వాన నగరవాసులను వణికించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాదాపు నగరమంతా వర్షం కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం.. ఆ రూట్లలో అస్సలు వెళ్లకండి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఇరు తెలుగు రాష్ట్రాలను వణికించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో ఏపీ, తెలంగాణ అతలాకుతలం అయ్యాయి. భారీగా కురిసిన వానలతో వరదలు సంభవించాయి. దీంతో విజయవాడ, ఖమ్మం నగరాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. వందలాది మంది వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ వర్షాలు, వరదల నుంచి తేరుకోకముందే మళ్లీ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో నేడు కుండపోత వర్షం కురిసింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.

ఆకాశానికి చిల్లు పడినట్టుగా దాదాపు నగరమంతా భారీ వర్షం దంచికొట్టింది. బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్ బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లక్డీకపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో హెవీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీస్‎ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఐటీకారిడార్ తో పాటు పలు చోట్ల భారీ వర్షం కురుస్తుండడంతో ఆయా రూట్లలో వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.