iDreamPost
android-app
ios-app

బంగారం లాంటి జీవితం.. ఆ ఒక్క కారణంతో!

  • Published Aug 30, 2024 | 11:57 AM Updated Updated Aug 30, 2024 | 11:57 AM

Hyderabad Crime News: ఈ మధ్యకాలంలో కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. పెద్దలు, సన్నిహితులు నచ్చజెప్పినా వినకుండా విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు.

Hyderabad Crime News: ఈ మధ్యకాలంలో కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. పెద్దలు, సన్నిహితులు నచ్చజెప్పినా వినకుండా విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు.

  • Published Aug 30, 2024 | 11:57 AMUpdated Aug 30, 2024 | 11:57 AM
బంగారం లాంటి జీవితం.. ఆ ఒక్క కారణంతో!

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం, మనస్థాపానికి గురవుతున్న విషయం తెలిసిందే.  ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడమో లేదా ఆత్మహత్యలకు పాల్పపడటం జరుగుతుంది. పట్టణాల్లో నివసించే  మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎంత సంపాదించినా  సరిపోకపోవడంతో అప్పులు చేయడం.. వాటికి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మద్యతరగతి కుటుంబాల్లో సాధారణంగా ఉండే పరిస్థితి ఇది.  ఓ మహిళ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఎవరూ ఊహించని పని చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం వెలుగు చూసింది. అప్పలు చేసి సకాలంలో తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంతపూర్ వెంకటరెడ్డి నగర్ లో షేక్ అమీర్ భాష, షేక్ షాహిన్ భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. షేక్ షాహిన్ కి గత ఏడాది సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ లో ఎస్ఐఎస్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం వచ్చింది. ఉదయం 5:30 గంటలకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు వచ్చేస్తుంది.  భర్త షేక్ అమీర్ భాష ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవల కుటుంబ అసరాల నిమిత్తం కొంత అప్పు చేశారు.

బుధవారం ఎప్పటి లాగే షేక్ హసీనా ఉద్యోగానికి వెళ్లింది. సాయంత్రం ఆమె కొడుకు షేక్ షకీరా పాషా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో ఎంత సేపు కొట్టినా ఎవరూ తీయలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా తన తల్లి సీలింగ్ ఫ్యాన్ ఉరివేసుకొని కనిపించింది. వెంటనే చుట్టు పక్కల వాళ్లను పిలిచాడు, తండ్రికి తెలియజేశాడు. దాంతో వారంతా వచ్చి తలుపు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి షేక్ హసీనా హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.. షేక్ హసీనా చనిపోయింది. వైద్యులు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు గా నిర్ధారించారు. అప్పులు తీర్చలేక ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పపడిందని, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.