iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. బస్సు కిందకి వెళ్ళిపోయిన ఆటో!

  • Published Aug 17, 2024 | 11:13 AM Updated Updated Aug 17, 2024 | 1:49 PM

Hyderabad Crime News: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. అతి వేగమే కొంపముంచిందని స్థానికులు అంటున్నారు.

Hyderabad Crime News: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. అతి వేగమే కొంపముంచిందని స్థానికులు అంటున్నారు.

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. బస్సు కిందకి వెళ్ళిపోయిన ఆటో!

దేశ వ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద దిక్కు కల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది అంగవైకల్యంతో బాధలు పడుతున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినప్పటికీ డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారు అంటున్నారు. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కిందకు ఆటో చొచ్చుకెళ్లిన ఘటనలో ఓ విద్యార్థిని అక్కడిక్కడే కన్నుమూసింది. వేగంగా దూసుకు వచ్చిన టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టడంతో అది కాస్త ఆర్టీసీ వెనుక భాగం కిందకు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సు కిందకు చొచ్చుకుపోయిన ఆటోని బయటకు తీశారు. అందులో ప్రయాణిస్తున్న వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక (15) అక్కడిక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ మల్లయ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆటో విద్యార్థులతో వెళ్తున్నట్లు తెలుస్తుంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  టిప్పర్ డ్రైవర్ నియంత్రం కోల్పోయి అతి వేగంగా వస్తూ ఆటోను వెనుక నుంచి గుద్దింది..  దీంతో ఆటో ముందుగా వెళ్తున్న  బస్సు కిందకు చొచ్చుకుపోయింది. టిప్పర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  స్కూల్ కి వెళ్తున్నా అని చెప్పి కానరాని లోకాలకు వెళ్లిపోయావా తల్లీ అంటూ సాత్విక తల్లిదండ్రుల కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన అందరి హృదయాలను కలచి వేస్తుంది. ఎన్ని కఠటిన చట్టాాలు తీసుకువస్తున్నా.. భారీ జరిమానాలు విధిస్తున్నా డ్రైవర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలి అవుతున్నారని స్థానికులు అంటున్నారు.