P Venkatesh
Telangana government banned DJs and fire crackers: హైదరాబాద్ లో ఇకపై డీజేలు, ఫైర్ క్రాకర్స్ వాడినట్లైతే చిక్కులు తప్పవు. డీజేలు, ఫైర్ క్రాకర్స్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana government banned DJs and fire crackers: హైదరాబాద్ లో ఇకపై డీజేలు, ఫైర్ క్రాకర్స్ వాడినట్లైతే చిక్కులు తప్పవు. డీజేలు, ఫైర్ క్రాకర్స్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
P Venkatesh
ఫంక్షన్స్, పండగలు సందర్భం ఏదైనా సరే డీజేలు మోగాల్సిందే.. టపాకాయలు పేల్చాల్సిందే. నేటి రోజుల్లో జరుగుతున్న పరిస్థితి ఇదే. ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు డీజేలకు జై కొడుతున్నారు. హుషారైన పాటలకు డ్యాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు. అదే సమయంలో విపరీతమైన శబ్ధం వచ్చే బాణాసంచాను పేలుస్తున్నారు. ఇది రాను రాను మితిమీరిపోతున్నది. డీజేలు, క్రాకర్స్ వాడకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శబ్ధ కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం కలవరానికి గురిచేస్తున్నది. డీజే మోతలతో వినికిడి లోపాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డీజే సౌండ్ కి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇక ఫైర్ క్రాకర్స్ వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, దృష్టిలోపాలు ఏర్పడుతున్నాయి. స్వల్ప కాలం ఆనందాల కోసం ఉపయోగించే డీజేలు క్రాకర్స్ దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతున్నాయి. అర్థరాత్రి వరకు డీజే మోతలు, బాణాసంచా సౌండ్ లతో నిద్రకు భంగం కలుగుతున్నది. ఈ నేపథ్యంలోనే డీజేలు, క్రాకర్స్ ను బ్యాన్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్ లు తలెత్తుతున్నాయి. మరి మీరు కూడా డీజేలు, ఫైర్ క్రాకర్స్ ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై మీరు చిక్కుల్లో పడినట్టే. డీజేలు, ఫైర్ క్రాకర్స్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో డీజేలు అండ్ ఫైర్ క్రాకర్స్ పై నిషేదం విధించింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ అందించారు సీపీ సీవీ ఆనంద్. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ డయల్ 100 కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు, అన్ని మత పెద్దలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్ మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు పూర్తి నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
రెసిడెన్షియల్ జోన్ లో 55 డిసిబల్స్, కమర్షియల్ జోన్ లో 65 డిసిబల్స్ కి మించితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. దీనితోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సీపీ సూచించారు. మరి హైదరాబాద్ లో డీజేలు, ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.