బర్త్ డే పార్టీకి అతిథిగా సమంతాను పిలుస్తామంటూ.. రూ.50 లక్ష మోసం!

Samantha Ruth Prabhu: సెలబ్రిటీల పేరు చెప్పి కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. అలానే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు చెప్పి రూ.50 లక్షల మేర మోసం చేసిన ఘ‌ట‌న ఒకటి చోటు చేసుకుంది.

Samantha Ruth Prabhu: సెలబ్రిటీల పేరు చెప్పి కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. అలానే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు చెప్పి రూ.50 లక్షల మేర మోసం చేసిన ఘ‌ట‌న ఒకటి చోటు చేసుకుంది.

సెలబ్రిటీలను చూడటానికి, కలవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాక  మరికొందరు అయితే తమ ఇళ్లలో జరిగే వేడుకలకు ముఖ్య అతిథులుగా పిలిపించుకుంటారు. వారి వారి పరిచయాలను బట్టీ సెలబ్రిటీలను కలుస్తుంటారు. మరికొందరు అయితే ఎంత ఖర్చైనా హీరోహీరోయిన్లను తమ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పిలిపించాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి బలహీనతలను కొందరు క్యాష్ చేసుకుంటారు. అంతేకాక  భారీగా ఆర్థిక మోసాలకు పాల్పడుతుంటారు. తాజాగా టాలీవుడ్ నటి సమంత పేరు చెప్పి ఓ వ్యక్తి రూ.50 లక్షల మేర మోసం చేశాడు. చివరకు అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

టాలీవుడ్ నటి సమంత పేరు చెప్పి.. రూ.50లక్షల మోర మోసం చేసిన ఘటన  హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటాడు. అయితే ఆయన బర్త్ డే పార్టీకి టాలీవుడ్ హీరోయిన్ సమంతను చీఫ్ గెస్ట్ గా  పిలిపిస్తానని రాజశేఖర్ కి ఈవెంట్ మేనేజర్ సుమంత్ రెడ్డి చెప్పాడు. అయితే ఆమెను ముఖ్య అతిథిగా తీసుకొచ్చేందుకు రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపాడు. అతడు చెప్పిన మొత్తం నగదు రాజ‌శేఖ‌ర్ రెడ్డి సుమంత్‌కు ఇచ్చాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల రాజశేఖర పుట్టిన రోజు వేడుకలు ఆగిపోయాయి. దీంతో తాను ఇచ్చిన  రూ.50 లక్షల నగదను తిరిగి ఇవ్వాలంటే ఈవెంట్ మేనేజర్ సుమంత్ ను రాజశేఖర్ అడిగాడు.  ఈ  నేపథ్యంలో తొలుత తాను తీసుకున్న నగదు ఇస్తానని సుమంత రాజశేఖర్ రెడ్డికి తెలిపాడు.

అయితే రోజులు గడుస్తున్న కొద్ది సుమంత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తానంటూ ఏడాది పాటు కాలయాపన చేశాడే కానీ తిరిగి డబ్బులు మాత్రం ఇవ్వలేదంట. దీంతో వ్యాపారి రాజశేఖర్ రెడ్డి చైతన్యపూరి పోలీసులను ఆశ్రయించి..జరిగిన విషయాన్ని తెలియజేశాడు. ఇక రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ మోసంలో హీరోయిన్ సమంతాకు ఎటువంటి సంబంధం లేదు.  ఇలానే కాకుండా చాలా మంది సెలబ్రిటీల పేరు చెప్పగానే త్వరగా మోసపోతుంటారు. తమకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయంటూ కొందరు బడాయి మాటలు చెప్పి.. అమాయకులను దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలా సెలబ్రిటీల పేరుతో, నిరుద్యోగలకు ఉద్యోగాలతో పేరుతో కొందరు కేటుగాళ్లు దారుణంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తుంటారు.

Show comments