iDreamPost
android-app
ios-app

మెట్రో ప్రయాణికుల టికెట్ కష్టాలకు చెక్.. ఇకపై డిజిటల్ విధానంలో..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్యాసింజర్ కష్టాలకు చెక్ పడనుంది. డిజిటల్ విధానంలో టికెట్స్ తీసుకునేలా సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్యాసింజర్ కష్టాలకు చెక్ పడనుంది. డిజిటల్ విధానంలో టికెట్స్ తీసుకునేలా సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు.

మెట్రో ప్రయాణికుల టికెట్ కష్టాలకు చెక్.. ఇకపై డిజిటల్ విధానంలో..

హైదరాబాద్ లో మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రయాణం సులువై పోయింది. ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయాయి. రోడ్డు ప్రయాణంతో విసుగెత్తిపోయిన వారంతా మెట్రో జర్నీకే మొగ్గు చూపుతున్నారు. బండి బయటికి తీసి రోడ్డెక్కితే ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఈ కారణంగా మెట్రో జర్నీకి డిమాండ్ ఏర్పడింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు వెళ్లే వారు మెట్రో జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమయం ఆదా అవడం, ప్రయాణ ఛార్జీలు సైతం అందుబాటులో ఉండడంతో మెట్రోకు ఆదరణ పెరిగింది. ట్రాఫిక్ లో చిక్కుకుంటామన్న టెన్షన్ లేదు. పొల్యూషన్ ఉండదు. నిత్యం వేలాది మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

ప్యాసింజర్స్ కు మరింత మెరుగైన సేవలను అందించేందుకు హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. టికెట్లపై రకరకాల ఆఫర్స్ ను ప్రవేశపెడుతున్నది. అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సరికొత్త టెక్నాలజీతో టికెట్స్ అందించేందుకు రెడీ అయ్యింది. హైదరాబాద్ మెట్రోలో సరికొత్త డిజిటల్ టికెటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మెట్రో ప్రయాణికుల కష్టాలకు చెక్ పడినట్టే ఇక. క్యూ లైన్స్ లో నిలబడి టికెట్స్ తీసుకునే ఇబ్బంది నుంచి ఊరట పొందొచ్చు. డిజిటల్‌ టికెట్‌ విధానాన్ని మంగళవారం (నవంబర్ 5) ఆవిష్కరించారు. దేశంలోనే ఫస్ట్ టైమ్ హైదరాబాద్ మెట్రోలో డిజిటల్ టికెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ, రూట్‌ మొబైల్, బిల్‌ఈజీతో కలిసి గూగుల్‌ రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ ఆధారిత ఆధునిక డిజిటల్‌ టికెట్‌ సేవలను హైదరాబాద్ మెట్రోలో ప్రవేశపెట్టారు.

హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌ అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సీవోవో, రూట్‌ మొబైల్‌ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్‌ జవార్, బిల్‌ఈజీ సీఈవో ఆకాశ్‌పాటిల్‌తో కలిసి కొండాపూర్‌లో ఈ సేవలను ప్రారంభించారు. నగదుతో పని లేకుండా మొబైల్‌లోనే గూగుల్‌ వాలెట్‌ RCS ఆధారంగా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి వాలెట్‌లో టికెట్‌ పొందవచ్చన్నారు. వీటితో పాటుగా త్వరలోనే డిజిటల్‌ పాస్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డిజిటల్ పాసులు అందుటాబులోకి వస్తే మెట్రో కార్డులతోనూ పని ఉండదని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన డిజిటల్‌ టికెటింగ్‌ విధానం రెండువారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరి హైదరాబాద్ మెట్రోలో డిజిటల్ టికెట్ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.