nagidream
Most Of The People Investing On Plots In These Areas: ఎక్కువ మంది ఒక ఏరియాలో భూములు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ కొన్ని రోజుల్లో ఎంతలా పెరిగిపోతుందో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి సమయంలోనే తక్కువ ధరకే భూమి కొనుగోలు చేసి డిమాండ్ పెరిగాక అమ్ముకుంటే కోట్లలో లాభాలు అందుకునే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
Most Of The People Investing On Plots In These Areas: ఎక్కువ మంది ఒక ఏరియాలో భూములు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ కొన్ని రోజుల్లో ఎంతలా పెరిగిపోతుందో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి సమయంలోనే తక్కువ ధరకే భూమి కొనుగోలు చేసి డిమాండ్ పెరిగాక అమ్ముకుంటే కోట్లలో లాభాలు అందుకునే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
nagidream
విశ్వనగరంగా హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశ నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీ, పెరుగుతున్న జనాభా వంటి కారణాల వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలని భావిస్తుంది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులను ప్రకటించింది. హైదరాబాద్ ని తలదన్నేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్లలో నాల్గవ సిటీ నిర్మిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నగర శివార్లలో కూడా మెరుగైన రవాణా ఏర్పాటు చేస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న భూములపై అప్పుడు ఇన్వెస్టర్ల చూపు పడిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరం అవుటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుటర్ రింగ్ రోడ్ వరకూ రవాణా సౌకర్యాలు కల్పిస్తుంది. రోడ్ల విస్తరణతో నగర శివార్ల నుంచి సిటీలోకి ప్రతీ నిమిషాలకొక సిటీ బస్సు వస్తుంది. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్లు కూడా తిరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు నగర శివారు ప్రాంతాలు కూడా సిటీలో భాగమైపోయాయి. ఒకప్పుడు కొండాపూర్, పటాన్ చేరు, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, మేడ్చల్, ఆరాంఘర్, రాజేంద్రనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు అవి సిటీలో కలిసిపోవడమే కాకుండా స్మాల్ సిటీలుగా మారిపోయాయి. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి వేగంగా జరుగుతుండడం వంటి కారణాల వల్ల సిటీకి వచ్చే అవసరం లేకుండా పోయింది. మరోవైపు ఘట్కేసర్, ఉందానగర్ ప్రాంతాలు కూడా సిటీకి దూరంగా ఉండేవి. ఇప్పుడు సిటీ పరిధి కూడా ఆ ప్రాంతాల వరకూ విస్తరిస్తుంది. దీంతో నగర శివారు ప్రాంతాలు అన్న పట్టింపు లేదు.
దీంతో అక్కడ భూముల ధరలకు డిమాండ్ పెరిగింది. నగరంలో ఉన్న స్థలాల ధరలతో పోలిస్తే సామాన్యులకు అందుబాటులో ఉన్న కారణంగా కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి జరుగుతుందని.. భూముల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయని నమ్ముతున్నారు.మరోవైపు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో కూడా భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. తొలి దశలో ఎంఎంటీఎస్ పరిధి 45 కిలోమీటర్లు ఉండగా రెండో దశకి వచ్చేసరికి 95 కిలోమీటర్లకు దాని పరిధి పెరిగింది. అవుటర్ రింగ్ రోడ్ దాటి వెళ్తుండడంతో రీజనల్ రింగ్ రోడ్ వరకూ నగరం విస్తరిస్తోంది. లింగంపల్లి దాటి తెల్లాపూర్ వరకూ ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతుండడం.. అవుటర్ రింగ్ రోడ్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరపల్లి, కొల్లూరు, వికారాబాద్ వరకూ ఈ ఎంఎంటీఎస్ రైళ్లను విస్తరించే ప్రణాళికలు ఉండడం కారణంగా నగర శివారు ప్రాంతాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ పెరగనుంది.