iDreamPost
android-app
ios-app

మియాపూర్ యువతి ఆత్మహత్య పై వీడిన మిస్టరీ.. నలుగురు అరెస్ట్

  • Published Aug 13, 2024 | 3:17 PM Updated Updated Aug 13, 2024 | 3:17 PM

ఇటీవలే మియాపుర్ లో ఉన్న కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. అయితే ఈ యువతి ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా ఈ కేసులో మిస్టరీని చేధించారు. అంతేకాకుండా.. ఆ యువతి కేసులో ఓ నలుగురిని అరెస్ట్ చేశారు.

  • Published Aug 13, 2024 | 3:17 PMUpdated Aug 13, 2024 | 3:17 PM
మియాపూర్ యువతి ఆత్మహత్య పై వీడిన మిస్టరీ.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 8వ తేదీన  ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే.  అయితే ఈ ఘటనలో పోలీసులకు, బంధువులు తెలిపిన వివల మేరకు..  ఒడిశా, ఝార్ఖండ్​రాష్ట్రానికి చెందిన  గీతాంజలి (21) అనే యువతి గత మూడేళ్ల క్రితం హైదరాబాద్ కి బతుకుదేరువు కోసం వచ్చింది. ఈ క్రమంలోనే..  మియాపూర్ మయూరి నగర్ లో ఉన్న కోరుకొండ కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. అయితే ఆ కోచింగ్ సెంటర్స్ ఈ నెల 5వ తేదీ నుంచి సెలవు ఇవ్వగా, ఆమె అక్కడే డ్యూటీ చేస్తుంది.

కాగా, ఎప్పటిలాగే ఈనెల  8వ తేదీ శనివారం డ్యూటీకి  వెళ్లిన యువతి ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, అదే రోజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మృతురాలు అంజలి కేసులో తాజాగా ఓ నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మియాపూర్  లో ఉన్న కోరుకొండ కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మృతురాలు అంజలి  ఆత్మహత్యకు వేధింపులే కారణమని తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే అంజలి పనిచేస్తున్న  కోచింగ్ సెంటర్ వద్ద అదే ఒడిశా ఝార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన ఓ నలుగురు సెక్యూరిటీ గార్డులు చాాలా కాలంగా పని చేస్తున్నారు. ఇక ఈ నలుగురు అంజలి పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవారని, తరుచు వేధించేవారట. ఈ క్రమంలోనే వారి వేధింపులు తట్టుకోలేక అంజలి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తెలింది. దీంతో మృతురాలు అంజలి మరణానికి కారణమైన తోటి సెక్యూరిటీ గార్డులు  శిష్ కుమార్(21), గౌతమ్​కుమార్(21), శంకర్​ఠాకూర్(21), మిథున్​కుమార్(30) లను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.