iDreamPost
android-app
ios-app

ఇస్త్రీ కార్మికులకు తీపి కబురు.. కొత్తగా LPG ఐరన్ బాక్స్.. ఖర్చు తక్కువ, సమయం ఆదా

  • Published Aug 12, 2024 | 3:42 PM Updated Updated Aug 12, 2024 | 3:42 PM

గత కొన్నేళ్లుగా ఇస్త్రీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. తాజాగా ఇస్త్రీ కార్మికులకు  తీపి కబురు అందిస్తూ.. ఎల్‌పీజీతో నడిచే గ్యాస్ ఆధారిత ఐరన్ బాక్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడంటే..

గత కొన్నేళ్లుగా ఇస్త్రీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. తాజాగా ఇస్త్రీ కార్మికులకు  తీపి కబురు అందిస్తూ.. ఎల్‌పీజీతో నడిచే గ్యాస్ ఆధారిత ఐరన్ బాక్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడంటే..

  • Published Aug 12, 2024 | 3:42 PMUpdated Aug 12, 2024 | 3:42 PM
ఇస్త్రీ కార్మికులకు తీపి కబురు.. కొత్తగా LPG ఐరన్ బాక్స్.. ఖర్చు తక్కువ, సమయం ఆదా

దేశంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన ఇంక కొన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు వెనుకబడే ఉంటారు. మరీ, అలాంటి కార్మిక రంగంలో ఇస్త్రీ రంగం కూడా ఒకటి. ఇందులో అప్పటికి, ఇప్పటికి పెద్దగా ఆవిష్కరణ అంటూ ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే.. గతంలో ఈ ఇస్త్రీ అనేది బోగ్గును మండించి చేసేవారు. ఇలా మండిన బొగ్గు ద్వారా ఇస్త్రీ పెట్టే వేడెక్కిన తర్వాత.. ఇస్త్రీ చేసేవారు. ఈ ఫ్రొసెస్ అంతా చేయటానికి చాలా సమయం పట్టేది. ఇక దీని నుంచి కాస్త డెవలెప్ అయ్యేందుకు మార్కెట్ లో కరెంట్ ఐరెన్ బాక్స్ లు అందుబాటులోకి వచ్చాయి.

అయితే వీటి వలన కూడా పెద్దగా మార్పు ఏమీ రాలేదు. ఎందుంటే.. ఈ కరెంట్ ఐరెన్ బాక్స్ ల వలన ఎక్కువగా విద్యుత్ బిల్లులు వస్తుంటాయి. దానికి తోడు కరెంట్ కోతలు కూడా ఎక్కువే. దీంతో ఈ ఇస్త్రీ రంగంలో జీవించే కార్మికులకు జీవన ఆదాయం లేక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. కనీసం ఒక్కో రోజూ కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మికులు వాపోతున్నారు. అయితే తాజాగా ఈ ఇస్త్రీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇక నుంచి ఈ కార్మికులకు కూడా మంచి రోజులు వచ్చేయని చెప్పవచ్చు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఇస్త్రీ కార్మికులకు  తీపి కబురు అందిస్తూ.. ఎల్‌పీజీతో నడిచే గ్యాస్ ఆధారిత ఐరన్ బాక్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కాగా, ఇప్పటికే వీటిని హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో.. పలువురు కార్మికులకు ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెలను అందజేశారు. అయితే ఈ ఇస్త్రీ పెట్టేల ద్వారా కార్మికులకు సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతందట. ఎందుకంటే.. . కరెంట్ ఐరన్ బాక్స్‌తో ఒక ప్యాంట్ ఇస్త్రీ చేసేందుకు రూ. 3 వరకు ఖర్చవుతుందట. అదే బొగ్గుల బాక్స్ అయితే రూ.1.35 వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఈ ఎల్పీజీ బాక్స్ తో మాత్రం కేవలం రూ. 55 పైసలు మాత్రమే అవుతుంది. ఇలా మొత్తానికి బొగ్గుల ఇస్త్రీ పెట్టెలకు నెలకు రూ.2500 ఖర్చవుతుండగా.. ఎల్పీజీ ఐరన్ బాక్స్‌కు కేవలం రూ.800 మాత్రమే అవుతుంది. దీంతో సమయంతో పాటు,  కార్మికులకు ఖర్చు కూడా ఆదా అవుతుంది.

ఇక ఈ బాక్స్ వినియోగంతో..కార్మికుల ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని జరగదు. కాగా, ఈ ఎల్పీజీ ఐరన్ బాక్స్ బరువు కేవలం 6.5 కేజీలు ఉంటుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా సులువు. కేవలం వంట చేసుకునే సమయంలో గ్యాస్ స్టౌన్ అన్ చేసినట్లుగానే ఆన్ చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసిన రెండు నిమిషాల్లోనే బాక్స్ వేడెక్కుతోంది. బాక్స్ నుంచి వచ్చే వేడిని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు.  అలాగే ఎల్పీజీ ఐరన్ బాక్స్‌ల వినియోగం ద్వారా ఆరోగ్యంపై కూడా ఎటువంటి ప్రభావం ఉండదు. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ ఎల్పీజీ ఐరన్ బాక్స్ లు దేశమంతటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరీ, నగరంలో ఇస్త్రీ కార్మికుల గురించి అందుబాటులోకి వచ్చే ఈ ఎల్పీజీ ఐరన్ బాక్స్ లపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.