nagidream
Land Rates In Regional Ring Road Areas: ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో పెట్టుబడి పెట్టకుండా తప్పు చేశామని బాధపడేవారికి ఇప్పుడు సంపాదించుకునే అవకాశం వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ పెట్టుబడితో భారీ లాభాలను పొందవచ్చు.
Land Rates In Regional Ring Road Areas: ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో పెట్టుబడి పెట్టకుండా తప్పు చేశామని బాధపడేవారికి ఇప్పుడు సంపాదించుకునే అవకాశం వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ పెట్టుబడితో భారీ లాభాలను పొందవచ్చు.
nagidream
రీజనల్ రింగ్ రోడ్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎక్కువ కాలం పడుతుంది. ప్రభుత్వాలు మారినా గానీ ప్రాజెక్ట్ పూర్తవ్వడం అయితే పక్కా. హైదరాబాద్ లో ఇన్నర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు అక్కడి వరకే ఉన్న సిటీ లిమిట్స్.. ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వరకూ పెరిగింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో హైదరాబాద్ పరిమితి అనేది పెరుగుతుంది. అప్పట్లో అవుటర్ రింగ్ రోడ్ వస్తుందంటే చాలా మంది దాని వల్ల ఉపయోగం ఏముంది? అంత దూరంలో ల్యాండ్ ఎవరు కొనుక్కుంటారు? అక్కడ ఎవరు ఉంటారు? అని అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి. అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక ఇవాళ అక్కడ స్థలాల ధరలు పెరిగిపోయాయి.
ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపల గజం స్థలం 40 వేల నుంచి 60 వేల రూపాయల వరకూ ఉంది. కొన్ని ఏరియాల్లో అయితే లక్ష, రెండు లక్షలు కూడా ఉంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా అవుటర్ రింగ్ రోడ్ లానే లాభాలు తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతారో వారికి తిరుగుండదని అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ వరకూ హెచ్ఎండీఏ లిమిట్స్ పెంచడం కూడా ఇన్వెస్టర్స్ కి గొప్ప అవకాశం అని చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఏరియాలో అవుటర్ రింగ్ రోడ్డు నుంచి 20 నుంచి 30 కి.మీ. పరిధిలో ఎక్కడ స్థలాలు కొన్నా గానీ భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏరియాల్లో గజం స్థలం రూ. 8 వేల నుంచి 30 వేలు, 50 వేలు వరకూ ఉంది. ఫ్యూచర్ లో ఈ ఏరియా హైదరాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో స్ధలం కొనలేకపోయామే అని బాధపడేవారు ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా సంపాదించుకునే అవకాశం వచ్చింది. 20 లక్షలు పెట్టుబడితో గజం 8 వేలు చొప్పున 250 గజాల స్థలం వస్తుంది. కొన్నేళ్ల తర్వాత గజం స్థలం 50 వేలు అయినా గానీ కోటి పైనే లాభం వస్తుంది. ఈ 20 లక్షల పెట్టుబడి కొన్నేళ్ళకి నాలుగైదు రెట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారి లక్షలు కోట్లు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది పలువురు నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాసిన కథనం. మీకు అవగాహన కోసం రాయబడింది. పెట్టుబడి పెట్టే ముందు అపారమైన అనుభవం, గుర్తింపు, విశ్వసనీయత ఉన్న రియల్ ఎస్టేట్ నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.