P Krishna
HYDRAA demolishing Constructions Hyderabad: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు వినిపిస్తుంది. ఈ పేరు వినిపిస్తే చాలు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
HYDRAA demolishing Constructions Hyderabad: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు వినిపిస్తుంది. ఈ పేరు వినిపిస్తే చాలు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
P Krishna
హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. దీని కారణంగా వర్షాలు పడితే భారీగా నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యర్వంలో ‘హడ్రా’ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో వరుసగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత పనుల్లో మునిగిపోయారు ‘హైడ్రా’ అధికారులు. రాజేంద్రనగర్ నియోజకర్గంలో గగన్ పహాడ్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్ప చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇక్కడ అక్రమంగా ఓ ప్లాస్టీక్ గోదాం నిర్మించగా దాన్ని కూడా కూల్చివేశారు. శుక్రవారం ఉదయం రాంనగర్ మణెమ్మ గల్లిలో నాలా, రోడ్డు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే.
హైడ్ర కమీషనర్ రంగనాథ్ ఆక్రమణలను పరిశీలించిన 24 గంటల్లోపే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాళాలు ఆక్రమించి కట్టుకోవడం వల్ల వర్షాలు పడితే వరదనీరు చేరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.
సర్వే నెంబర్ 20, 21 వార్డ్ 155 బ్లాక్ జమిస్తాన్ పూర్ లో కొంతమంది అక్రమంగా స్థలాన్ని ఆక్రమించి కల్లు కాంపౌండ్, మరొక నాలాను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టడంతో చర్యలు తీసుకున్నామని అధికారలు తెలిపారు. భారీ బందోబస్తు మధ్య జేసీబీ, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి నిర్మాణాలను నేలమట్టం చేశారు. పేద ప్రజలు ఎప్పటి నుంచో నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడంపై ప్రతిపక్షాలు విమ్శిస్తున్నప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు హైడ్రా. అక్రమ నిర్మాణాలు అని తేలితే నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు.