‘హైడ్రా’ మరో కీలక నిర్ణయం..ఇకపై ఇద్దరు చొప్పున..

Hydra is Another Key Decision: అక్రమంగా ప్రభుత్వ భూములు, చెరువుల, నాలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది హైడ్రా. వరుస కూల్చివేతలతో కబ్జాదారులకు భయం పట్టుకుంది.

Hydra is Another Key Decision: అక్రమంగా ప్రభుత్వ భూములు, చెరువుల, నాలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది హైడ్రా. వరుస కూల్చివేతలతో కబ్జాదారులకు భయం పట్టుకుంది.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRA).ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ‘హైడ్రా’ పేరు వినిపిస్తే చాలు కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నగరంలోని చెరువులు, కుంటలు, నారాళలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు చేపట్టిన వారికి నోటీసులు ఇస్తూ బుల్డోజర్ తో కూల్చివేసే పనిలో ఉంది హైడ్రా.దీంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా.. తెలంగాణ ప్రజలు హైడ్రా పనితీరు.. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగరాల్లో పలు అక్రమాలు తొలగించి వరదలు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ఏర్పాటు చేసిందే ‘హైడ్రా’. చెరువుల, కుంటలు ఆక్రమించి వాటి బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారులు. కేవలం కూల్చి వేతతోనే పని పూర్తి కాదని.. దాన్ని మరోసారి అక్రమణలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా పరిరక్షించాలని యోచిస్తుంది. ఈక్రమంలోనే హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో చెరువు వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించేందుకు కసరత్తు చేస్తుంది. దీని వల్ల ఎవరైనా చెరువులను ఆక్రమించాలని చూస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకునే విధంగా ఉంటుందని హైడ్రా భావిస్తుంది.

హైడ్రాను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కేటాయించారు. సీఐలు, ఎస్ఐలతో పాటు మరికొంతమంది పోలీస్ సిబ్బందిని హైడ్రా విధులకు కేటాయించారు. చెరువులకు ఎప్పటికీ రక్షణ కల్పించే దిశగా హైడ్రా కమీషన్ రంగనాథ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఒక్కో చెరువు వద్ద ఇద్దరు చొప్పున సెక్యూరిటీ గార్డులను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సెక్యూరిటీ గార్డులు చెరవులు, కుంటల వద్ద 24 గంటలు పహారా కాస్తుంటారు. చెరువుల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో 450 చెరువులు, ఔటర్ రింగ్ రోడ్డు మున్సిపాలిటీ, పంచాయితీ పరిధిలో 300 దాకా చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని హైడ్రా భావిస్తుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని చెరువులకు సెక్యూరిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

Show comments