P Krishna
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది హైడ్రా. చెరువులు, కుంటలు, నాళాలను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. అక్రమ కట్టడాలు అని తేలితే ఎంత పెద్ద పొజీషన్ లో ఉన్నా నోటీసుల ఇచ్చి బుల్డోజర్లకు పని చేబతుంది హైడ్రా వ్యవస్థ.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది హైడ్రా. చెరువులు, కుంటలు, నాళాలను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. అక్రమ కట్టడాలు అని తేలితే ఎంత పెద్ద పొజీషన్ లో ఉన్నా నోటీసుల ఇచ్చి బుల్డోజర్లకు పని చేబతుంది హైడ్రా వ్యవస్థ.
P Krishna
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరు వినిపిస్తుంది. సామాన్య, రాజకీయ, సినీ, వ్యాపార రంగంలో ఉన్న ఎవరైనా సరే అక్రమంగా కబ్జా చేసి కట్టడాలు నిర్మించినట్లు ఫిర్యాదు అందితే చాలు రంగంలోకి దిగి బుల్డోజర్లతో కూల్చి వేస్తుంది హైడ్రా. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి భవిష్యత్ లో వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టడానికి ‘హైడ్రా’ను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. ఇటీవల హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వేన్షన్ సెంటర్ కూల్చి వేసిన తర్వాత ‘హైడ్రా’ పేరు మారుమోగుతుంది. ఈ పేరు వింటే చాలు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో వణుకు పుడుతుంది. తాజాగా హైడ్రాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో పలు అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రజల మెప్పు పొందిన హైడ్రా ప్రస్తుతం కూల్చి వేతలు ఆపింది. నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఫిర్యాదు అందితే చాలు 24 గంటల్లో అక్కడికి చేరుకొని కూల్చివేతల పనులు మొదలు పెడుతుంది. పూర్తి సర్వే చేసిన తర్వాత నిబంధనలు విరుద్దంగా కట్టడాలు ఉన్నాయని తేలితే.. వెంటనే కూల్చివేతల పనులు మొదలు పెడుతుంది. ప్రస్తుతం కూల్చివేతల పనులకు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలోనే వారికి సాయంగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
ఈ కారణంతోనే ప్రస్తుతం కూల్చి వేతలకు బ్రేక్ ఇచ్చినట్లు చెప్పారు. హైడ్రా బృందాలు జీహెచ్ఎంసీ మాన్ సూన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు. వర్షాలు తగ్గిన తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేత పనులు మళ్లీ మొదలుపెడతాం అని అన్నారు. ప్రస్తుతం రంగనాథ్ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చెరువుల, కుంటల పక్కన ఉన్న కాలనీలలో పర్యటిస్తూ.. బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో పర్యటిస్తూ అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.. వారం లోగా ఖాళీ చేయకుండా కూల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.