SNP
Hyderabad, Tonique Elite, Wine Shop, Excise Department: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Hyderabad, Tonique Elite, Wine Shop, Excise Department: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
హైదరాబాద్‌లోని లగ్జరీ మద్యం షాపు టానిక్ ఎలైట్‌ను తాజాగా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా షాపు నడుపుతుండటంతో.. భారీగా మద్యాన్ని సీజ్ చేశారు. ఈ షాపు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. 2016లో నుంచి నడుస్తున్న ఈ టానిక్ ఎలైట్ మద్యం షాపులో ఆదివారం ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించి.. షాపును నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారని తేలడంతో సీజ్ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం టానిక్ ఎలైట్ మద్యం దుకాణం రెన్యువల్ ను ఎక్సైజ్ శాఖ రిజెక్ట్ చేసింది. ఇక ఎక్సైజ్ శాఖకి సంబంధించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాల వేలం జరుగుతూ ఉంటుంది. ఇక 2016లో ప్రత్యేకంగా టానిక్ ఎలైట్ షాపుకు అనుమతి తీసుకున్నాడు ఓనర్. అయితే అనుమతి కోసం మరోసారి రెన్యువల్ చేయాలని మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఈ షాపు యజమాని ఎక్సైజ్ చట్టం కు వ్యతిరేకంగా టానిక్ ఎలైట్ షాపుని అనుమతి లేకుండా రెన్యువల్ చేసుకున్నట్లు తేల్చిన ఎక్సైజ్ శాఖ దరఖాస్తును తిరస్కరించింది. నిజానికి ఆగస్టు 31 నాటికి ఈ టానిక్ ఎలైట్ షాపు కు అనుమతి ఉంది. కానీ సెప్టెంబర్ 1న కూడా అమ్మకాలు సాగించడంతో సీజ్ చేశారు. హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ సీఐ వాసుదేవరావు ఇతర ఎక్సైజ్ పోలీసులు కలిసి షాప్‌ను సీజ్ చేశారు. ఇక ఈ మద్యం దుకాణంలో ఏకంగా 10,291 మద్యం బాటిళ్లు ఉన్నట్లు లెక్కించారు. దాని విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మరి ఈ షాప్ సీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.