iDreamPost
android-app
ios-app

ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. బంపరాఫర్లు.. భారీగా డబ్బు ఆదా

Hyderabad Metro Rail Offers: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రయాణికుల ఆదరణపొందిన ఆ ఆఫర్లు మరికొంత కాలం అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్లపై కీలక నిర్ణయం తీసుకున్నది.

Hyderabad Metro Rail Offers: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రయాణికుల ఆదరణపొందిన ఆ ఆఫర్లు మరికొంత కాలం అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్లపై కీలక నిర్ణయం తీసుకున్నది.

ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. బంపరాఫర్లు.. భారీగా డబ్బు ఆదా

హైదరాబద్ లో మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రయాణ కష్టాలు తగ్గాయి. ట్రాఫిక్ లో ఇరుక్కుంటామన్న భయం లేదు. పొల్యూషన్ బాధా లేదు. మెట్రో రైలులో టెన్షన్ లేకుండా వెళ్లాల్సిన గమ్యానికి చేరుకోవచ్చు. నిత్యం వేలాదిమంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే వారు మెట్రో జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రయాణ సమయం తగ్గుతుండడంతో మెట్రోకు ఆదరణ పెరిగింది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్స్ ను ప్రవేశపెడుతున్నది.

ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో మెట్రో ప్రయాణికులకు భారీగా ప్రయోజనం చేకూరనున్నది. మెట్రో ప్రయాణం చేసేవారికి భారీగా డబ్బు ఆదాకానున్నది. మెట్రో ప్రయాణికుల నుంచి సూపర్ సేవర్ ఆఫర్, స్టూడెంట్ పాస్ ఆఫర్, సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఆఫర్లను మరింతకాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో ఈ ఆఫర్లను పొడిగించింది. జనాధరణ పొందిన మూడు బంపర్ ఆఫర్లను మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది.

గడువు పొడిగించిన ఆఫర్లు చూసినట్లైతే.. సూపర్ సేవర్ ఆఫర్-59: కేవలం రూ.59తో అపరిమిత ప్రయాణాన్ని ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ లిస్టెడ్ సెలవుల్లో ఆస్వాదించవచ్చు. స్టూడెంట్ పాస్ ఆఫర్: విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ప్రత్యేక ఆఫర్. ఇది మెట్రో ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెస్తుంది. సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లపై (సీఎస్‌సీలు) 10 శాతం తగ్గింపును పొందొచ్చు. వీటితో పాటు అక్టోబర్ 6, 2024 నుంచి ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ నాగోల్‌తో పాటు మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ రుసుములను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.