iDreamPost
android-app
ios-app

ఫుల్లుగా నిండిపోయిన హుస్సేన్‌సాగర్‌.. భయాందోళనలో GHMC అధికారులు!

  • Published Sep 01, 2024 | 4:12 PM Updated Updated Sep 01, 2024 | 4:12 PM

Hyderabad: నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని  వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షల కారణంగా నగరంలో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు నీరు పోటెత్తుతోంది. దీంతో  జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు భయాందోళనలో ఉన్నారు.

Hyderabad: నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని  వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షల కారణంగా నగరంలో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు నీరు పోటెత్తుతోంది. దీంతో  జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు భయాందోళనలో ఉన్నారు.

  • Published Sep 01, 2024 | 4:12 PMUpdated Sep 01, 2024 | 4:12 PM
ఫుల్లుగా నిండిపోయిన హుస్సేన్‌సాగర్‌.. భయాందోళనలో GHMC అధికారులు!

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పడీనం వాయుగుండంగా మారడంతో.. భీభత్సమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతంల్లో నదులు, కాలువు, చెరువుల్లో వరద నీరు పొంగి పోర్లుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు నీరు పోటెత్తుతోంది. దీంతో  జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు భయాందోళనలో ఉన్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని  వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్ష కారణంగా నగరంలోని బంజారా హిల్స్, కూకట్‌పల్లి, పికెట్ వంటి ప్రాంతాల‍్లో  విపరీతమైన వరద నీరుతో అంతా జలమైయంగా మారింది. ఇక ఈ వరద నీరంతా నగరంలో హుస్సేన్ సాగర్‌లోకి చేరుతుందనే విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తాజాగా  హుస్సేన్ సాగర్‌  లోని నీటిమట్టం  ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరింది. అయితే సాగర్‌ నీటి మట్టం పూర్తి పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టం 513.70 మీటర్‌లకు చేరుకుంది, అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 515 మీటర్లుగా ఉండగా.. ప్రస్తుతం సాగర్‌ ఇన్‌ఫ్లో 10270 క్యూసెక్కులు, అలాగే అవుట్‌ ఫ్లో 9622 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్‌ సాగర్‌ నీటి ఉధ్రికత్త పెరగడంతో దయచేసి ఎవరూ కూడా హుస్సేన్‌ సాగర్‌ వద్దకు వెళ్లకుడాదని ప్రజలను అప్రమత్తం చేస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

మరోవైపు నగరంలో దంచికొడుతున్న వర్షాల కారణంగా జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసారంబాగ్‌ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే నగరంలో ప్రజలకు  ఏదైనా దైనా సహాయం కావాలంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111 ను సంప్రదించాలని సూచించారు.