iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లేవారు త్వరగా వెళ్తే బెటర్

  • Published Aug 19, 2024 | 4:57 PM Updated Updated Aug 19, 2024 | 4:57 PM

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తూనే ఉంది.

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తూనే ఉంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లేవారు త్వరగా వెళ్తే బెటర్

హైదరాబాద్ లో వర్షం కుమ్మేస్తుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తుంది. ఉరుములు, మెరుపులు లేకుండా అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎర్రగడ్డ, యూసఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లాంటి వెస్ట్ హైదరాబాద్ ఏరియాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, మలక్ పేట్ మినహా  మిగతా అన్ని ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షాలు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి ప్రాంతాలు భారీ వర్షం కారణంగా నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చాలా వరకూ సికింద్రాబాద్ కంటోమెంట్ ప్రాంతంలో దాదాపు అన్ని రోడ్లు నీట మునిగాయి. అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని అధికారులు చెబుతున్నారు.

భారీ వర్షాల కారణంగా షేక్ పేట నాలా నీరు భారీగా నిలిచిపోయింది. మోకాళ్ళ లోతు నీరు ఉండడంతో కార్లు, బైక్ లు కదలడం లేదు. ఆటోలు, కార్లు ఆ వరద నీటిలో ఆగిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతం వైపు పోలీసులు ఆంక్షలు విధించారు. వేరే రూట్ల వైపు వాహనదారులను దారి మళ్లిస్తున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్, ఛార్మినార్, ఆరాంఘర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. రోడ్లు మరింత మునిగే అవకాశం ఉంది. కాబట్టి బయట ఉన్నవారు, ఆఫీసుల్లో ఉన్నవారు త్వరగా ఇంటికి వెళ్తే మంచిది. లేదంటే రాత్రి సమయంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు మోకాళ్ళ లోతు నీటిలో మునుగుతూ వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. వాహనాలు ఆగిపోతే మరిన్ని ఇబ్బందులకు గురవుతారు.