Dharani
IMD Pink Alert To Hyd, Rangareddy: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో మరో 3రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు పింక్ అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
IMD Pink Alert To Hyd, Rangareddy: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో మరో 3రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు పింక్ అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు పింక్ అలర్ట్ జారీ చేశారు అధికారు. రాగల 48 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరమైతేనే జనాలు బయటకు రావాలని సూచించారు. ఐఎండీ పింక్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వాసులు అవసరం అయితే బయటకు రావాలని సూచించారు.
హైదరాబాద్ లో ఇప్పటికే శనివారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తుంది. నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుందని రాత్రి సమయానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పింక్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయంటున్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు ఎవరు చెట్ల కింద ఉండకూడదని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ కు పింక్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా వాయుగుండం మారటానికి మరో 24 గంటల సమయం పడుతుంది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మాడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకూ తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అనగా శనివారం నాడు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ సహా మంచిర్యాల, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.