iDreamPost
android-app
ios-app

Heavy Rains: నేడు విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!

  • Published Sep 02, 2024 | 8:23 AM Updated Updated Sep 02, 2024 | 8:23 AM

Heavy Rains-Holiday To Students, Work From Home To Employees: భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ వివరాలు..

Heavy Rains-Holiday To Students, Work From Home To Employees: భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Sep 02, 2024 | 8:23 AMUpdated Sep 02, 2024 | 8:23 AM
Heavy Rains: నేడు విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!

బంగాళాఖాతాంలో ఏర్పడిన వాయుగుండం రెండు తెలుగు రాష్ట్రాలకు వరుణ గండంగా మారింది. గత రెండు, మూడు రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ఆదివారం నాడు ఎడతెరపి లేని వర్షం కారణంగా పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం నాడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఇప్పటికే అధికారులు నేడు అనగా సెప్టెంబర్ 2, సోమవారం నాడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా చూసేలా.. వారికి వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఆ వివరాలు..

తెలంగాణలో.. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో.. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రధాన వాగులు పొంగిపోర్లుతుండటంతో.. జిల్లాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. ఇక.. భారీ వర్షాలతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది.

holidays for schools

ఇక.. హైదరాబాద్ నగరంలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈవాళ కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించటంతో.. తెలంగాణ ప్రభుత్వం నేడు అనగా సెప్టెంబర్ 02, సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు సహా.. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోతుంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు రోజులుగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నేడు కూడా నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడమే కాక.. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అయితే.. ఇప్పటికే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. చాలా ప్రాంతాలు జగదిగ్బందమయ్యాయి. చిన్న వర్షానికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామయ్యే హైదరాబాద్ లో సోమవారం నాడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని పోలీస్ శాఖ కార్యాలయాల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో.. ట్రాఫిక్‌ సమస్యతో పాటు ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని.. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయిల్ డేవిస్.. ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే అనేక కంపెనీలు సానుకూలంగా స్పందించి.. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేసుకునే అవకాశం కల్పించారు.